AP Electricity: Electricity burden on the people of AP once again..!

విద్యుత్ చార్జీల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా ఏం జరిగిందో చూశాం. విద్యుత్ చార్జీలను గత ప్రభుత్వం భారీగా పెంచేసింది. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. ట్రూ అప్ చార్జీల పేరుతో అదనపు భారం వేసింది. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం సరి కదా, మరో 15%, 20% విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం కూడా అని ఎన్నికలకు ముందు కూటమికి సంబంధించిన నేతలు హామీ ఇస్తూ వచ్చారు. ప్రధానంగా టిడిపి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక చోట్ల సభల్లో ఆయన విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం. విద్యుత్ పేరుతో దోపిడీ జరుగుతుంది అంటూ మాట్లాడుతూ వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీల తగ్గింపు మాట పక్కన పెడితే, విద్యుత్ చార్జీల భారం మరింత పెరుగుతూ వచ్చింది. తాజాగా మరొక 12 వేల కోట్ల రూపాయలు ట్రోప్ చార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం వేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నట్లు కనపడుతుంది. అటువంటి ఆలోచనను విరమించుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేయడం కూడా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల అంశానికి సంబంధించి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి సంబంధించి కూడా గతంలో అధికారంలోకి రావడానికంటే ముందు కూటమికి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. సెకీ ఒప్పందంలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పైన భారం పడింది అన్నారు. భారీగా అవినీతి జరిగింది అన్నారు, అధికారంలోకి రావడానికి ముందు మాత్రమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెకీ ఒప్పందం అక్రమం అంటూ చెప్తూ వచ్చారు. సెకీ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ ఒక్క రోజు జరిగిన అన్యాయం కాదు వచ్చే 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి పోయింది గత సర్కార్ అంటూ చెప్తూ వచ్చారు. సెకీ ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, ఆ సెకీ సంస్థకు విద్యుత్ సరఫరా చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఆదాని తీసుకున్నారు, అటువంటి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో అవినీతి ఎక్కడ ఉంది అంటూ, గత ప్రభుత్వం ప్రశ్నిస్తూ వస్తుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!

Updated On
ehatv

ehatv

Next Story