ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల పేరుతో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకుంది. బనకచర్ల ద్వారా గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకెళ్ళాలనుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల పేరుతో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకుంది. బనకచర్ల ద్వారా గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకెళ్ళాలనుకుంది. తుంగభద్ర బేసిన్ వరకు తీసుకెళ్లాలనుకుంది. దానిలో భాగంగా బనకచచర్ల ప్రాజెక్ట్ కి 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పింది. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం ఎగువన బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ద్వారా, గోదావరి జలాల్ని, గోదావరిలో మిగులు జలాల్ని, గోదావరి ద్వారా వృధాగా సముద్రంలోకి పోతున్న వరద జలాలని వాడుకుంటామంటూ చెప్పింది. గోదావరి ప్రాజెక్ట్, గోదావరి నది పైన, బనకచచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందాలకు విరుద్ధంగా ఉంది. ఆ బనకచచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. నీటి కేటాయింపులకు విరుద్ధంగా ఉంది. సిడబ్ల్యూసి నియమాలకు విరుద్ధంగా ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంగా చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ఉంది.
బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణ నిర్మాణాన్ని వ్యతిరేకించాలి అంటూ తెలంగాణ కోరుతూ వచ్చింది. తెలంగాణ, బనకచర్ల ప్రాజెక్ట్ పైన అనేక ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సిడబ్ల్యూసి, రకరకాల కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఇది సహేతుకం కాదు, ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ బనకచర్లకు సంబంధించిన ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చాయి. బనకచెర్ల పైన ఫీజబిలిటీ రిపోర్ట్ ని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. దానిపైన కూడా కేంద్రం ముందుకు వెళ్ళలేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. వీటన్నిటి నడుమ బనకచర్ల ఎట్టి పరిస్థితిలో నిర్మించి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. బనకచచర్ల ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక గేమ్ చేంజర్ గా ఉండబోతుంది అంటూ చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది, ఈ మీటింగ్ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాల పైన అధికారులు కమిటీ వేస్తామంటూ ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆ కమిటీ వేయలేదు, అసలు ఆ మీటింగ్ లో బనకచర్లపైన చర్చే జరగలేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి, చర్చ జరిగింది అని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రులు మాట్లాడడం చూశాం. ఆ తర్వాత ఆ మీటింగ్ కి సంబంధించిన ఔట్‌కం అయితే డెఫినెట్ గా ఈ క్షణానికి జీరో అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత నెల అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బనకచచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచింది. ఆ టెండర్లులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రాజెక్టు కి సంబంధించిన డిపిఆర్‌ని తయారు చేయాల్సి ఉంటుంది.ఆ డిపిఆర్ తయారు చేయడానికి సంబంధించిన టెండర్లు గత నెల 31 తో గత నెల 31 తో ముగియాల్సి ఉంది. 31 లోపు ఎవరైనా ఆ డిపిఆర్ తయారు చేయడానికి సంబంధించి టెండర్లు దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆ టెండర్లు దాఖలు చేయడానికి సంబంధించిన ప్రక్రియను, ఆ టెండర్లు ఓపెన్ కాకుండా మిగతా వాళ్ళకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ఏర్పాటు, డిపిఆర్ తయారు చేయడానికి సంబంధించి, ఏ టెండర్లు అయితే ప్రభుత్వం పిలిచిందో, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ని పబ్లిక్ డొమైన్ లో ఎవరికీ అందుబాటులో లేకుండా చేసింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


