పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పైన తీవ్రమైన వ్యతిరేకత చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలోని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మినహా, జనసేన కూడా పీపీపీ విధానాన్ని గట్టిగా సమర్ధించలేకపోతుంది. పీపీపీ విధానం పైన జనసేన కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బహుశా పార్టీల దాకా చేరింది కాబట్టే జనసేన అటువంటి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా, వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ విద్య పైన అవగాహన ఉన్నవాళ్ళు, డాక్టర్లు, మేధావులు కూడా కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తం ప్రజాభిప్రాయం అంతా పిపిపి మోడల్‌లో ప్రభుత్వం కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే, కొంతమంది ఈ జీవోని ఇటువంటి ఆలోచన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచనని, వెనక్కి తీసుకునేలా చేయాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో దీనిపైన విచారణ జరిగిన తర్వాత రెండు రోజుల క్రితం కోర్టు చెప్పిన మాట పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కాలేజీలు ఇవ్వడాన్ని మేము ఆపలేం, మేము అడ్డుకోలేం పైగా తప్పేం కాదు, ప్రభుత్వం చట్ట ప్రకారమే చేస్తుంది, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే చేస్తుంది అంటూ హైకోర్టు కామెంట్ చేసింది. ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం, ఇటువంటి డెసిషన్లు తీసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి డెఫినెట్ గా ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వానికి అటువంటి అధికారం లేకపోతే డెసిషన్ తీసుకోదు కదా, కానీ తీసుకున్న డెసిషన్ కారణంగా ప్రజలకు జరిగే ఇబ్బంది ఏంటి, ప్రజలకు జరిగే ఇబ్బంది ఏంటి అనేది కదా, పాయింట్ ప్రజలకు జరిగే ఇబ్బంది ఏంటో చూడడం కాదు, మా బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వం చేసిందా లేదా మాత్రమే, మా బాధ్యత మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నాం, చట్ట ప్రకారం మేము పోతాం, ప్రజలు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మాకు తెలియదు అన్నట్టుగా హైకోర్టు బిహేవ్ చేసినట్టు భావించాలి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
