Ys Jagan : జగన్‌కు ఏంటి సంబంధం.. హైకోర్టు మొట్టికాయలు..!
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూటమి సర్కారు పెట్టిన కేసు దానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూటమి సర్కారు పెట్టిన కేసు దానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం. ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌లో వెళ్తున్న సందర్భంగా సింగయ్య (Singayya)అనే కార్యకర్త ఆ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని.. ఆ తర్వాత ఆసుపత్రికి తరళించిన తర్వాత మరణించాడు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి (Ys jagan)వాహనం డీకొని ఆయన మరణించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న కొంతమంది పార్టీ నేతలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి ఈ అంశంలో ముందుగా వేరే వాహనం డీకొంది అంటూ ఎస్పీ స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వాహనానికి సంబంధించిన నెంబర్‌తో సహా చెప్పారు. రెండు రోజుల తర్వాత జగన్ వాహనమే డీకొంది అంటూ ఒక వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. A2గా జగన్మోహన్ రెడ్డిని ఆ కేసులో ఎఫ్ఐఆర్(FIR)లో పేరు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాడిన కారును కూడా పోలీస్ అధికారులు సీజ చేశారు. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరించారని, కావాలని తొక్కించుకొని వెళ్ళిపోయారన్నారు. సో ఆయన అక్కడ తన కారు కింద ఒక వ్యక్తి పడ్డారని తెలిసినప్పటికీ ఆ వ్యక్తిని ఈడ్చి గుంజేసి పక్కన పడేసి అలాగే వెళ్లిపోయారని, సో ఇంటెన్షనల్ గానే ఇది చేశారు తరహాలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాయడం చూశాం. ప్రభుత్వం పెట్టిన కేసులో కూడా ముందుగా వాహనం ఢీకొని సింగయ్య మరణించాడు అని చెప్పిన సందర్భంగా 105 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు చేసిన సందర్భంగా 10649 సెక్షన్‌లను పెట్టారు. సో ఈ సెక్షన్స్ ఇంటెన్షనల్‌గానే ఆ క్రైమ్‌కు పాల్పడ్డారు అనే అనేదాన్ని సూచించే సెక్షన్స్. ఈ సెక్షన్స్ కింద కేస్ నమోదు చేశారు ఈ కేసు పైన హైకోర్టుకి వెళ్లారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు వైవి సుబ్బారెడ్డి, మరి కొంతమంది నాయకులు. ఈ కేసులో హైకోర్టు ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది నిజానికి ఈ అంశానికి సంబంధించి హైకోర్టు మొట్టికాయలు వేయబోతోంది. ఈ కేసు అంత బేస్‌లెస్‌గా ఉంది ఈ కేసు పొలిటికల్ మోటోతో మాత్రమే ఉంది ఈ కేసు నిలబడే అవకాశమే లేదు అని జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా రెండు రోజుల క్రితం నేను మీ అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఈరోజు హైకోర్టు కచ్చితంగా అదే విషయాన్ని చెప్పింది కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయమే ఇది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపెపెట్టుగా ఉన్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR'విశ్లేషణ..!
