AP Liquor Scam Closed? : మద్యం కేసు నీరుగారిపోతుందా..! సీనియర్ జరర్నలిస్ట్ 'YNR' దగ్గర ఉన్న సమాచారమేంటి..?
నేను ఇప్పుడు చెప్పబోతున్న మాట నిజమవుతుందో లేదో నాకు తెలియదు కానీ, నిజం అవుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం ఉంది.

నేను ఇప్పుడు చెప్పబోతున్న మాట నిజమవుతుందో లేదో నాకు తెలియదు కానీ, నిజం అవుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం ఉంది. సమాచారం ఎవరు చెప్పారంటే, నేను చెప్పలేను, బయటకి కానీ మద్యం కేసు అటకెక్కబోతోంది. ఆంధ్రప్రదేష్‌లో సంచలనం సృష్టించిన మద్యం కేసు క్రమక్రమంగా నీరు గారబోతోంది. ఇది నా దగ్గర ఉన్న సమాచారం ఇది. నా దగ్గర ఉన్న సమాచారం మాత్రమే కాదు, చాలా వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న చర్చ, ఆంధ్రప్రదేష్‌లోని అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ, అధికారుల్లో జరుగుతున్న చర్చ, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ లో జరుగుతున్న చర్చ, మద్యం కేసుని ఏదో ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా కూటమి, సర్కారు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. మద్యం అంశానికి సంబంధించి పెద్ద అరెస్టులు జరగబోతున్నాయంటూ ఊదరగొట్టింది. మద్యం అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సాయంత్రమో, రేపో అరెస్ట్ అవుతారంటూ లీకులు ఇచ్చింది, మద్యం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడొద్దు మీరేం మాట్లాడొద్దు మీరేం మాట్లాడొద్దు అంటూ పదే పదే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారనే వార్తలు చూశాం.
మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన అరెస్టులు జరిగాయి, గత ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు అరెస్ట్ అయ్యారు, గత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు, ఇంత జరిగిన తర్వాత దీంట్లో కాంప్రమైజ్ ఎందుకు ఉంటుంది, ఇంత జరిగిన తర్వాత దీంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, కాంప్రమైజ్ జరగకపోతే, కాంప్రమైజ్ అవ్వకపోతే, ఇంతకంటే కీలకమైన పరిణామాలు ఉండే పరిస్థితి ఉంటుంది, కాబట్టే కాంప్రమైజ్ అయ్యారు.
కాంప్రమైజ్ అయ్యి కేసు కొట్టేసి, రేపు పొద్దున అందరిని వదిలేస్తారంటే కాదు, విచారణ ఫార్మల్ గా జరుగుతుంది, విచారణ ఆలస్యంగా జరుగుతుంది, ఈలోపు వేరే ఇష్యూ వచ్చి జనాలు మర్చిపోతారు, జైలుకి వెళ్ళినోళ్ళు బెయల్ పైన బయటికి వస్తారు, ఇష్యూ సమ్ అప్ అయిపోతుంది. బట్ 3600 కోట్ల రూపాయలు ఎక్కడ, 3600 కోట్ల రూపాయలు ఏమైపోయాయి, అచ్చా దానికంటే ముందు ఎందుకు సమప్ అవుతుంది అంటే, ఎందుకు ఈ కేసు నీరుగారిపోతుంది అంటే, ఎందుకు మధ్యవర్తిత్వం జరిగి రాజీ జరిగిపోయింది అంటే, 3600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ప్రచారం చేసిన వాళ్ళు, విచారణకు ఆదేశించిన వాళ్ళు, విచారణ చేసిన వాళ్ళు తేల్చలేకపోయారు. పిల్లి మొగ్గలు వేస్తున్నారు, పిల్లి మొగ్గలు వేస్తున్నారు, పిల్లి మొగ్గలు వేస్తూ, ఆ 3600 కోట్ల రూపాయలు జనాలకు పంచేశారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ లో పెట్టారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో బంగారు బిస్కెట్లు కొన్నారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో ఆఫ్రికాలో గనులు తీసుకుంటారు తీసుకున్నారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేశారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారంటారు, ఒకసారి ఆ 3600 కోట్ల రూపాయలతో ఇంకా ఏదో, ఇంకా ఏదో ,ఇంకా ఏదో చేశారంట. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
