Ap Medical Colleges : ఈయనకు బాధ్యత లేదు.. ఆయనకు బుర్ర లేదు..!
ఆంధ్రప్రదేష్‌లో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండు రాజకీయ పార్టీలు అయితే నువ్వు లేకపోతే నేను ఆంధ్రప్రదేష్‌ని పరిపాలిద్దాం అని ఒప్పందం చేసుకున్నట్లు కనపడతాయి.

ఆంధ్రప్రదేష్‌లో రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రెండు రాజకీయ పార్టీలు అయితే నువ్వు లేకపోతే నేను ఆంధ్రప్రదేష్‌ని పరిపాలిద్దాం అని ఒప్పందం చేసుకున్నట్లు కనపడతాయి. బయటికి కనపడవు హిడెన్ గా అటువంటి ఇంప్రెషన్ కనపడుతుంది, అయితే వైసీపీ లేకపోతే, టీడీపీ కాకపోతే వైసీపీ నువ్వో నేను ఎవరో ఒకరం రూల్ చేద్దాం, ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కంటే, నీ, నా భవిష్యత్తే ముఖ్యం అన్నట్టుగా, రెండు పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేష్‌లో జరిగిన పరిణామాలను, రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత అటువంటి అభిప్రాయం మరింత బలంగా కలుగుతోంది, ఆ సందర్భంగా కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను, ఆంధ్రప్రదేష్‌లో అధికార పార్టీ కానీ, ఆంధ్రప్రదేష్‌లో ప్రతిపక్ష పార్టీ కానీ, ఏమాత్రం బాధ్యత లేకుండా, ఏమాత్రం బుర్ర లేకుండా పని చేస్తున్నాయి.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆంధ్రప్రదేష్‌లో పార్టీలు చేస్తున్న తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడమే నా ఈ ఉద్దేశం, ఏంటి అధికార పార్టీ చేస్తున్న తప్పుఏంటి, ప్రతిపక్షం చేస్తున్న తప్పుఏంటి, ముందు అధికార పార్టీ నుంచి మొదలు పెడదాం, అధికార పార్టీ చేస్తున్న తప్పు ఏంటి అంటే, అధికార పార్టీ కొద్దిసేపటి క్రితం శాసన సభలో ఓ తీర్మానం చేసి పంపించింది, కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టి ధరల తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేసింది, జీఎస్టి ధరలు తగ్గింపు అనేది నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం, అంటూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది పెద్దలు నరేంద్ర మోడీకి ఒక సన్మాన సభన పెట్టారు, అసెంబ్లీలో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, ఆయనకి మరి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో తెలియదు కానీ, జీఎస్టి ధరలు తగ్గింపు కారణంగా దేనికి ధరలు తగ్గుతున్నాయి, అనేది ప్రతి ఊరు తీసుకెళ్లి ప్రచారం చేయాలంటా ప్రభుత్వం, ఆ బాధ్యత మనకు ఉంది, ప్రచారం చేయాలి అంటున్నారు.
కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్‌కు రాష్ట్రంలో కూడా ఎన్డిఏ సర్కారే ఉందనుకోండి, ఈ స్థాయిలో సాగిలపడిపోవాల్సిన అవసరం ఏంటి, ఓ మంచి పని చేస్తే అప్రిషియేట్ చేద్దాం, సాగిలపడిపోదాం, దండం పెడదాం, కాళ్ళు పట్టుకుందాం, ఏంటి వాళ్ళు చేసిన మంచి పని జీఎస్టి ధరలు తగ్గింపు అనేది, దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన వరమా, ఎన్డిఏ ఇచ్చిన వరమా, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశా ఏ రకంగా వరం అవుతుంది, అని ఒక రెండు చిన్న హార్డ్ ఫాక్ట్స్ మీంద మీ ముందు పెడతా, ఏంటి ఆ ఫాక్ట్స్ అంటే, 2017 లో జీఎస్టి పేరుతో దేశవ్యాప్తంగా 18% , 28% పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. సో ఆ పన్నులు విధించిన రోజు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్ క్యాపిటా ఇన్‌కం 1,42,054 రూపాయలు. ఆ రోజు దేశ ప్రజల పర్ క్యాపిటా ఇన్కం 1,30,061. కానీ ఆరోజు అన్ని పన్నులు వేసింది. ఎందుకు ఇంత కేంద్రానికి సాగిలాలాపడుతున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
