Govt Medical Colleges : మెడికల్ కాలేజీలకు మంగళం..!
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసింది కూటమి సర్కారు.

ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసింది కూటమి సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది ఖచ్చితంగా దుర్వార్త. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యను వైద్యాన్ని పేదలకు దూరం చేసే కుట్ర ఇది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను కేటాయించింది గతంలో, అందులో ఏడు మెడికల్ కాలేజీలని గత సర్కార్ పూర్తి చేసింది, కంప్లీట్ గా పూర్తి చేసి అక్కడ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. సో మిగతా నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా అడ్మిషన్స్ తీసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ, వాటిని కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ తీసుకోకుండా పక్కన పెట్టేసింది లాంటి విమర్శలు ఎదుర్కొంటోంది. పులివెందుల లాంటి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడ స్టాఫ్ ఉండడానికి సంబంధించిన క్వార్టర్స్ పూర్తి కాలేదనే కారణంతో ఈ ఏడాది మాకు అడ్మిషన్లు వద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం చూశాం. సో ఇవి మినహా మిగతా మెడికల్ కాలేజీలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజేషన్ ఇంకా వాటికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి, ఏడాది కాలంలో పూర్తి కాని మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టకుండా, ఏడాది కాలంలో కొంచెం మాత్రమే మిగిలి ఉన్న కాలేజీలకు సంబంధించిన పని పూర్తి చేయకుండా, వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది కూటమి సర్కారు. వాటిని పూర్తిగా పక్కన పెట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక ద్రోహం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఏంటంటే, ఏడు మినహా మిగిలిన 10 మెడికల్ కాలేజీల్ని పిపిపి మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతుంది.
ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలని అప్పగించడం అంటే అవి పూర్తిగా ప్రైవేట్ కాలేజీలు గానే, ప్రైవేట్ హాస్పిటల్స్ గానే ఉండే పరిస్థితి, పేదలు అక్కడ వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్ల కోసం, రిజర్వేషన్లు ద్వారా అక్కడ సీట్లు పొందే విద్యార్థులు కావచ్చు, లేకపోతే అక్కడ చదువు, అక్కడ ప్రైవేట్ రంగంలో అవి ఉంటే సీట్లు సాధించడానికి అవకాశం ఉన్న విద్యార్థులు కావచ్చు, నష్టపోయే ప్రమాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊహించలేకపోతుందా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయాలనుకుంటుందో తెలియదు కానీ, 10 మెడికల్ కాలేజీల్ని పిపిపి మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రకు ఈరోజు శ్రీకారం చుట్టింది, దానిలో భాగంగా నాలుగు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతోంది. మిగతా వాటిని కూడా త్వరలో అప్పగిస్తామని చెప్తుంది, ఇది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసినట్లు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రైవేట్ కి అప్పగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, గతంలో ఏడు మెడికల్ కాలేజీల్ని అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా పూర్తి చేసినప్పుడు, మిగతా 10 మెడికల్ కాలేజీలో కనీసం ఐదు మెడికల్ కాలేజీలని అయినా, మీ టెన్యూర్లో ప్రభుత్వపరంగా పూర్తి చేసి అడ్మిషన్లు ఇస్తాం, అక్కడ వైద్య సేవలు అందిస్తామనే భరోసాని ఎందుకు కల్పించలేకపోతున్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డిఏ సర్కారే ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు, గడిచిన ఏడాది కాలంలో, 14 నెలల కాలంలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో సంపదని సృష్టించామని చెప్తున్నారు కదా, 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నారా, గడిచిన ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నారా, ప్రైవేట్ వ్యక్తులకు వీటిని అప్పగించడం పైన మీకున్న ఆసక్తిని ఎందుకు అనుమానించకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీని అప్పగించాలనే మీ ఆలోచన వెనక దురుద్దేశాలను ఎందుకు చూడకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
