AP CM Chandra Babu: AP wants to Know..బాబు గారెక్కడ?
AP wants to know..where is AP CM Chandra Babu?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రులు పర్యటనలు చేస్తున్నారు విదేశాలకు. గడిచిన 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తీసుకురావడం కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం, కాలికి బలపం కట్టుకొని దేశమంతా ప్రపంచమంతా, తిరుగుతున్నామని చెప్తూ వచ్చారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించామని చెప్తూ వచ్చారు. అటువంటి పెట్టుబడుల సమీకరణలో భాగంగా గతంలో దావోస్ వెళ్ళాం అని చెప్తూ వచ్చారు. దావోస్ లో ఒక్క రూపాయ పెట్టుబడి రాలేదు అంటే, దావోస్ కి వెళ్ళింది పెట్టుబడులు ఇమ్మీడియట్ గా తెచ్చేయడం కోసం కాదు, పిఆర్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పారు. ఓకే ఆ తర్వాత సింగపూర్ వెళ్ళారు, సింగపూర్ కన్సాల్టీ ని ఒప్పియాలి అమరావతిని కట్టడం కోసం అని చెప్పారు. ప్రతి మూడు నెలల కోసం మంత్రుల బృందం పోయి సింగపూర్ అధికారులని కలిసి వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సింగపూర్ ప్రభుత్వాన్ని లంచం అడిగారు అని కూడా చెప్పారు సో ఇవన్నీ కూడా ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రులకు విదేశీ పర్యటనలకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు, అఫ్కోర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఉండట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండని సందర్భంలో , తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోన లేరు, ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఎక్కడున్నారో ఏ ఒక్కరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్తే ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇంకొకళ చెప్పి, డబ్బా కొట్టి చప్పుడు చేసి, చాటింపేసి చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ, వాళ్లిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులు.


