రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆర్నాబ్ గోస్వామి వీడియో ఒకటి బాగా వైరల్ అవ్వడం చూస్తున్నాం.

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆర్నాబ్ గోస్వామి వీడియో ఒకటి బాగా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఏంటి ఆ వీడియోలో ఏముంది అంటే, ఆ వీడియోలో ఉన్న మాట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఇనెఫిషియంట్ గా ఉన్నాడు.ఆ కారణంగానే ఇండిగో సంక్షోభం వచ్చింది అనేది రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి చెప్తున్న మాట. ఈ సందర్భంగా చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చూపించిన అత్యుత్సాహం, జాతీయ స్థాయిలో లోకేష్‌, రామ్మోహన్ నాయుడు పలుచున అవ్వడానికి కామెడీ మెటీరియల్ గా మారడానికి కారణమైంది. జాతీయ స్థాయి చర్చలో కేంద్ర మంత్రికి సంబంధించిన అంశం పైన చర్చ జరుగుతున్నప్పుడు, దేశవ్యాప్తంగా విమానాలకు సంబంధించిన అంశంలో ప్రయాణికులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల పైన చర్చ జరుగుతున్నప్పుడు, నారా లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నారు, నారా లోకేష్ వార్ రూమ్ పెడుతున్నారు అంటూ దీపక్ రెడ్డి మాట్లాడడం, ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీని విలన్‌ చేసింది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని ఒక కామెడీ పీస్‌గా మార్చేసింది. ఈ అంశానికి సంబంధించి దీపక్ రెడ్డి మాట్లాడిన అంశం తప్పు కావచ్చు, దీపక్ రెడ్డి ఆ సందర్భంలో లోకేష్ ప్రస్తావన అక్కడ తీసుకురావడం డెఫినెట్ గా తప్పే, నారా లోకేష్ ని పొగడడం, నారా లోకేష్ పైన పొగడ్తల వర్ష కురిపించడం ఆయనకి మేము దగ్గర అని చెప్పుకోవడం, ఆయనకి లాయల్ గా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, ప్రయత్నంలో భాగంగా చాలా మంది తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలా చేస్తున్నారు. రీజనల్ పార్టీలో పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని పొగడడం అనేది ఒక ప్రధానమైన కర్తవ్యంగా, మొదటి అంశంగా, మొదటి లైన్ గా, అది ఉండాలని నాయకత్వం భావిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే నారా లోకేష్ పైన పొగడ్తల వర్షం కురిపించడం, లేకపోతే ఆయన ఏదో చాలా కష్టపడుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేయడంలో భాగం,గా దీపక్ రెడ్డి ఆ చర్చలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆర్నాబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారు, ఆయన ఫోన్ చేస్తే హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నారు, ఆయన ఏమైపోయారు, ఈ మొత్తం సంక్షోభానికి ఆయనే కారణం, నారా లోకేష్ కి ఏంటి సంబంధం, నారా లోకేష్ ఎలా ఈ సమస్యను పరిష్కారం చేయగలరు అంటూ ఆయన స్టైల్ లో, ఆయన దీపక్ రెడ్డి పైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైన విమర్శలు చేయడం చూశాం.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్నాబ్ గోస్వామిని ఒక తోపు జర్నలిస్ట్ గా ప్రచారం చేస్తున్నారు. ఆర్నాబ్ తెలుగుదేశం పార్టీని ఆడుకున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఆర్నాబ్ గోస్వామి అంత తోపు జర్నలిస్టా.. ఆర్నాబ్ గోస్వామి ఈ దేశానికి పట్టిన దరిద్రాల్లో ఒకటి కదా, భారతదేశానికి సంబంధించిన మీడియా ఏ రకంగా ప్రభుత్వానికి బాకా ఊదుతుంది, అనే అంశానికి సంబంధించి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చను చూస్తున్నాం. తాజాగా ఒక ఛానల్ వీడియో చేయడం, తెలుగు మీడియా సారీ భారతదేశ మీడియాకు సంబంధించిన అంశం పైన నేను కూడా వీడియో చేశా. దానిపైన భారతదేశంలో మీడియా వార్తల విశ్వసనీయత 90 శాతనికి పైగా పడిపోయింది అని, భారతదేశంలో మీడియా ఏదో ఒక పార్టీకి బాకా ఉదే మీడియా మాత్రమే మారిపోయింది అని, అందులో ఆర్నాబ్ గోస్వామిని కూడా ఊటంకిస్తూ దాదాపు ఆరు నెలల రీసెర్చ్ తర్వాత ఆయన నిర్వహిస్తున్న ఒక షోలో గంట సేపు షో జరిగితే, ఆ షోలో పార్టిసిపేట్ చేసిన మొత్తం ప్యానలిస్టుల అందరికీ దక్కిన సమయం 15 నిమిషాలు అయితే, కేవలం ఆర్నాబ్ ఆ షోలో ఆర్గ్యూ చేసిన సమయం 40 నిమిషాలు పైగా, ఈ రకంగా నడుస్తున్నాయి జాతీయ ఛానల్ ఛానల్లో చర్చలు. జాతీయ ఛానల్లో చర్చలు, జాతీయ ఛానల్లు పార్టీలకు సంబంధించిన కార్యాలయాలుగా మారిపోయాయి.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story