ఆంధ్రప్రదేశ్ శాసన సభ శాసన మండలి జరుగుతున్న తీరు గమనించిన తర్వాత, రెండు ఆసక్తికరమైన రాజకీయ సంఘటనలని మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం

ఆంధ్రప్రదేశ్ శాసన సభ శాసన మండలి జరుగుతున్న తీరు గమనించిన తర్వాత, రెండు ఆసక్తికరమైన రాజకీయ సంఘటనలని మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో ఉద్దేశం. ఏంటంటే, ఒకటి శాసన మండలిలో చర్చ జరుగుతుంది, సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి, ఉద్యోగాల భర్తీ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది, ఈ సందర్భంగా వైసీపీ కి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప జిల్లాకు సంబంధించిన రమేష్ యాదవ్, అప్పటి కుప్పం ఎమ్మెల్యే ఈ తరహా హామీలు ఇచ్చారు అంటూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే ఎలా అంటావు అంటూ శాసన మండలిలో చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు, సదరు వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్ పై విరుచుకు పడ్డారు. ఆయన వ్యాఖ్యలు తప్పు అంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన పైన చర్యలు తీసుకునే వరకు సభని నడవనియబోమన్నారు, ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అని అవమానిస్తారా, ఇంత అహంకారమా అంటూ మాట్లాడారు.

అప్పుడు వైసీపీ దానికి చెప్పిన మాట ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ, ఆయన హామీ ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నేత కావచ్చు ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు, కాబట్టి అప్పటి ప్రతిపక్షత చంద్రబాబు నాయుడుని మేము కుప్పం ఎమ్మెల్యే అని సంబోధిస్తే తప్పేంటి, మేము కుప్పం ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడుని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, కుప్పం ఎమ్మెల్యే అంటే మీకు కోపం వచ్చింది, బాధ అనిపిస్తోంది, మా నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అంటూ మీరు మాట్లాడితే మాకు కూడా అలాగే ఉంటుంది కదా, అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. సరే ఏదేమైనా ఓ సభానాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవ పరిచేలా మాట్లాడడం సరైంది కాదు, సమర్ధనీయం కాదు, ముఖ్యమంత్రిని అని ఉండాల్సింది, ముఖ్యమంత్రిగానే సంబోధించి ఉండాల్సింది, సరే దాన్ని ఏ కాంటెస్ట్ లో అన్నారు, ఏంటి సభ, స్పీకర్ మొత్తం పరిశీలన చేసి చూస్తారేమో చూద్దాం.

అది జరిగిన తర్వాత ఒక అరగంటకో, ఒక గంటకో, శాసన సభలో ఓ సంఘటన జరిగింది, ఇక్కడ కూడా సూపర్ సిక్స్ అమలు, ఇంకేదో ఇంకేదో సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంగా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్ని వ్యవస్థలని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసారు, సినిమా వాళ్ళని ఇంటికి పిలిచి అవమానించాడు, ఇంటికి పిలిచి నేను కలవను అదేంటి, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రిని కలవండి అంటూ చెప్పారు. అప్పుడు చిరంజీవి పట్టుబట్టి లేదు, లేదు మీరు కలవకపోతే ఎట్లా నేను మీ మాట, మా వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళ ముందు నా పరువు పోతుంది, మీరు కలవకపోతే ఎలా అని చిరంజీవి గట్టిగా మాట్లాడితే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిశాడు, కలిసి అవమానించాడు అంటూ కామినేని శ్రీనివాస్ అన్నారు, సో ఆ మాట కొత్త ఏం కాదు చాలా సందర్భాల్లో వైసీపీపైన కూటంకి సంబంధించిన నేతలు ఇదే తరహ వ్యాఖ్యలు, సభ బయట కూడా చేస్తూ వచ్చారు. అవే వ్యాఖ్యలని భారతీయ జనత పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో మాట్లాడారు. సో దీనిపైన మాట్లాడిన బాలకృష్ణ ఓ మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీ అధ్యక్షుడిని, సైకో గాడు అన్నారు, అసెంబ్లీలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు అక్కడ మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు సభలో, అటెండ్ అయి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ,అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిని కుప్పం ఎమ్మెల్యే అంటే గగ్గోలు పెట్టింది అధికార పార్టీ, అలా అగౌరవంగా ఎలా మాట్లాడుతారో అంది. ఇక్కడ ఓ మాజీ ముఖ్యమంత్రిని సైకో గాడు అంటూ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడితే చప్పట్లు కొట్టుకున్నారు, నవ్వుకున్నారు, సరదాగా ఆహ్లాదంగా గడిపేశారు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story