జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో విభేదించి వైసీపీ నుంచి జనసేనలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేరారు. ఆసందర్భంలో బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా ఖండించలేదు. అయితే జనసేన ఆవిర్భావ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్సీ కావాలని పవన్‌ను అడగలేదన్నారు. కేవలం పవన్‌ కాల్‌షీట్స్‌ మాత్రమే ఇవ్వాలని కోరానన్నారు. ఆయనతో ఓ సినిమా చేసేందుకు తనకు డేట్స్‌ ఇవ్వాలని కోరినట్లు బాలినేని చెప్పారు. దీంతో పాటు జగన్‌పై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌ తన ఆస్తులను, తన వియ్యంకుడి ఆస్తులను, తన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను గుంజుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది చాలా చాలా పెద్ద స్టేట్మెంట్. జగన్‌ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక మంత్రిగా ఉన్నారు. చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ముఖ్య పాత్ర పోషించారు, అంతేకాక జగన్‌కు బంధువు కూడా. అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఆస్తులు ఎలా పెరిగాయనేది సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని కూడా కోరారు. అసలు ఒక్కసారిగా బాలినేని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ.

Updated On
ehatv

ehatv

Next Story