Journalist YNR : దారి తప్పిన బండి సంజయ్.. దారిలోకి వచ్చేదెలా.. YNR విశ్లేషణ..!
బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం కష్టపడ్డారు.

బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం కష్టపడ్డారు. పాదయాత్రలు చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కూడా ఒక స్టేక్ హోల్డర్ గా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. సో బండి సంజయ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అటువంటి బండి సంజయ్ రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా అనిపిస్తుంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్ని ఆయన మాట్లాడట్లేదు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని అనిపించింది. మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల టిఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి. దాడి చేస్తామని చెప్పి మా రామచంద్రరావు, మా యువమోర్చా కార్యకర్తలను ఆదేశించాడు, నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తది అని చెప్తున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాలు ఇచ్చారు, బిజేవైఎం కార్యకర్తలకు ఓ న్యూస్ ఛానల్ పైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే ఇమ్మీడియట్ గా తెలంగాణ భవన పైన మా కార్యకర్తలు దాడి చేస్తారు అని చెప్తున్నారు. భారతదేశంలో శాంతిభద్రతలు, భారతదేశం రక్షణ ఇవన్నీ చూడాల్సిన ఓ మంత్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై, మేము దాడి చేస్తాం, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఫీషియల్ గా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చారు అని అనౌన్స్ చేస్తున్నారు, రాంగ్ రూటే కదా ఇది డెఫినెట్ గా రాంగ్ రూటే కదా, ఎందుకు ఆయనక అంత కోపం వచ్చింది అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తారు అనే సమాచారం ఉందంట. దాడి చేస్తే ఇక్కడ రివెంజ్ తీర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెడీగా ఉంటారంట. ఏబిఎన్ కార్యాలయం పైన దాడి చేస్తే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా బిఆర్ఎస్ పార్టీ పైన, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయించండి. వాళ్ళ పైన చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారం వాళ్ళకు శిక్షలు పడేలా చూడండి. ఇంకా ఏబిఎన్ పైన మీకు అచంచలమైన ప్రేమ అభిమానాలు ఉంటే ఏబిఎన్ ఛానల్ కు 24 అవర్స్ కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇవ్వండి, సీఆర్‌పీఎఫ్‌ను దించండి, అక్కడ అవసరమైతే ఆక్టోపస్ ని పెట్టండి, ఎన్ఎస్జీ ని తీసుకురండి, సంస్థకు పూర్తి కేంద్ర స్థాయి బద్ధత కల్పించండి, ప్రొటెక్ట్ చేయండి ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఇవి రెండు చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..!
