Be careful with YCP : వైసీపీతో జాగ్రత్త.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు మీటింగ్..!
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అధ్యక్షులు , నియోజక వర్గాలకు సంబంధించిన బాధ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు మొత్తం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతటితో ఒక టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ని విజయవంతంగా అమలు చేస్తున్నాం, మనం సూపర్ సిక్స్ ని విజయవంతంగా అమలు చేస్తున్నాం కాబట్టే, ఇటీవల సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన రిసెప్షన్ దొరికింది, మనకి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పబ్లిక్, ప్రజలంతా బాగా రిసీవ్ చేసుకున్నారంటే అర్థం మనం అంత అద్భుతంగా కార్యక్రమాలని చేస్తున్నామని, ఎమ్మెల్యేలని, పార్టీకి సంబంధించిన నాయకుల్ని, ఎవరిని ఎక్కడ అడ్డుకున్న దాఖలాలే లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే దాఖలాలు లేవు, ప్రజలు చాలా పాజిటివ్ గా ప్రభుత్వం పట్ల ఉన్నారు, అనేదానికి నిదర్శనం మేము సెపరేట్ మెకానిజం ద్వారా , ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు అనేది తెలుసుకున్నాం.
చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది అంటూ ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా అభినందించారు. సేమ్ టైం పార్టీ కోసం పని చేసిన వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అందిస్తున్నామనే విషయం చెప్తున్నారు, ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి, వాటిని కూడా పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో పార్టీకి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు, ఆ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పారు. దానితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచన చేశారు.
మొత్తం మీటింగ్ లో ఎక్కువ సమయాన్ని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండండి అనేది చెప్పడానికే కేటాయించారు, వైసీపీ తో చాలా జాగ్రత్తగా ఉండండి, వైసీపి ప్రమాదకారి అంటూ ఆయన చెప్పిన మాటలు, యస్ ఇట్ ఈస్ గా రాష్ట్రంలో ఒక నేర చరిత కలిగిన పార్టీ ఉంది, వాళ్ళ పని నిత్యం విషం చిమ్మడం మాత్రమే, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే, వారి పని సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో, అనుబంధ మీడియాతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు, రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఊళ్ళు మునిగిపోతున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, సో అటువంటి తప్పుడు ప్రచారం, రాజధాని మునిగిపోయింది అనేది తప్పుడు ప్రచారం, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి అనేది తప్పుడు ప్రచారం, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేసి ప్రజల్లో ఒక భయాందోళనను కలిగిస్తున్నారు, రాజధాని కోసం పొన్నూరుని ముంచారని ఓసారి, కొండవీటివాగు ఎత్తువతల పథకం పంపులు పని చేయట్లేదని మరోసారి, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఇంకోసారి, ఇటువంటి వార్తలు వేస్తున్నారు, పొన్నూరు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న అంబటి మురళి ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రాజధానిలోకి నీళ్లు వెళ్ళకుండా ఉండడం కోసం పొన్నూరు ప్రాంతంలోని వేల ఎకరాల పంటల్ని నీట ముంచారు అంటూ అలిగేషన్ చేశారు. చంద్రబాబు మీటింగ్‌పై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
