Andhra Jyothi Radhakrishna: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు భట్టి హిడెన్ స్ట్రోక్..!
Andhra Jyothi Radhakrishna: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు భట్టి హిడెన్ స్ట్రోక్..!

సింగరేణి టెండర్లకు సంబంధించి తెలంగణ డిప్యూటీసీఎం భట్టి విక్రమార్కపై ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ గురించి, జరుగుతున్న వివాదం చూశాం. ఆ ఆర్టికల్‌లో భట్టి విక్రమార్క కొంత మందికి టెండర్లు కట్టబెట్టేందుకు సింగరేణి సంస్థ నిబంధనలు మార్చేశారు. మార్చేయడం మాత్రమే కాదు, వేరే వాళ్లు పార్టిసిపేట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. వేరే వాళ్లు టెండర్ల కోసం వస్తుంటే వారిపై తప్పుడు ప్రచారం చేయించారంటూ నేరుగా భట్టి విక్రమార్క టార్గెట్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆర్టికల్ రాయడం చూశాం. ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇమీడియెట్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఆ ఆర్టికల్‌లో రాసినవన్నీ అబద్ధాలు అని చెప్పారు. ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాధకృష్ణ సంగతేంటో పూర్తి వివరాలు తెలుసుకొని నేను తర్వాత చెప్తానని ఆయన చెప్పారు. ఈరోజు భట్టి విక్రమార్క ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. టెండర్ల రద్దు తర్వాత సింగరేణి టెండర్లన్నీ ముఖ్యమంత్రి బంధువులకే అప్పగించారని బీఆర్‌ఎస్ ఆరోపించిన నేపథ్యంలో రాధాకృష్ణ టార్గెట్‌గా ఆయన మాటలు ఉండబోతున్నాయి. రాధాకృష్ణ టార్గెట్‌గా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతుంది అని భావించారంతా. కానీ ప్రెస్‌కాన్ఫరెన్స్ తర్వాత రాధకృష్ణను ఏమీ అనలేదేంటి గట్టిగా, రాధకృష్ణను గట్టిగా మాట్లాడలేదంటి లాంటి విశ్లేషణలు కూడా చూశాం. నిజానికి రాధాకృష్ణ ఒక హిడెన్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక విధంగా రాధాకృష్ణకు అర్థమవుతే, రాధాకృష్ణకు భట్టి విక్రమార్క వేసిన కౌంటర్ నుంచి తేరుకోవడం చాలా కష్టం. ఏంటా కౌంటర్, ఏం మాట్లాడారు ఆయన, రాధకృష్ణ ఆర్టికల్‌లో ఎప్పుడైనా ఎవిడెన్సెస్ కంటే, ఆధారాల కంటే రాజకీయపరమైన విమర్శలు, వాడు వీడితో కలిశాడు, వీడు వాడితో కలిశాడు లాంటి ఊహాగానాలు, తెరవెనుక ఏదో జరిగిందంటూ రాయడాలు, ఆ రాతల వెనుక ఇంకేదో ప్రయోజనాలు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఈ అంశపై సీనియర్ జర్నలిస్ట్ YNR పూర్తి విశ్లేషణ..!


