బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణ చేయడానికి సంబంధించిన అనుమతిని ఏసీబీ సాధించింది.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణ చేయడానికి సంబంధించిన అనుమతిని ఏసీబీ సాధించింది. ఆయన ప్రాసిక్యూషన్ కి సంబంధించిన అనుమతిని సాధించింది. ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనను విచారించాలంటే, ప్రాసిక్యూట్ చేయాలంటే, గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖకు గవర్నర్ స్పందించారు. ఆయన విచారణకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు అంశానికి సంబంధించి విచారణ జరగబోతుంది. ఈ విచారణకు ఇప్పటికే ఏసీబి విచారణకు నాలుగు సార్లు కేటీఆర్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయి తన వర్షన్ ఏంటో ఆయన చెప్పారు, గత డిసెంబర్ 20 నుంచి ఈ కేసు నడుస్తోంది.
గత డిసెంబర్ 20న కేసు నమోదయింది. ఆ తర్వాత పలు రకాలుగా ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్ళని విచారణ చేస్తూ వచ్చింది. ఏసీబి ఈ కేసులో మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి ఐటి మినిస్టర్ కేటీఆర్‌ని, A1 కేసులో పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధానమైన అభియోగం 50 కోట్ల రూపాయల నిధుల్ని విదేశీ కంపెనీకి, మంత్రివర్గ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు అని. ఆ 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చట్ట విరుద్ధం అనేది ఆ ప్రభుత్వం చేస్తున్న ఆర్గుమెంట్, ఏసిబి చేస్తున్న ఆర్గుమెంట్, ఆర్బిఐ కి తెలియకుండా, మంత్రివర్గానికి తెలియకుండా 50 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని విదేశీ కంపెనీకి ఏ రకంగా మళ్లించారనేది ప్రశ్న. ఈ ప్రశ్నలో నిబంధనలు పాటించకపోవడం మాత్రమే కనిపిస్తుంది, తప్ప అవినీతి ఎక్కడుంది అనేది బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేస్తున్న ప్రశ్న. బిఆర్ఎస్ పార్టీ వేస్తున్న ప్రశ్న. ఈవెన్ ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడారు, చాలామంది మంత్రులు, పీసీసి అధ్యక్షులు కూడా మాట్లాడిన మాటలు దీంట్లో అవినీతి జరిగిందని మేము ఎక్కడా చెప్పలేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పాం, ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం కూడా నేరమే కదా, ప్రొసీజర్ ఫాలో అవ్వడం వెనక కూడా నేరపూరితమైన ఉద్దేశం ఉందని భావించాల్సిన అవసరం ఉంటుంది కదా అని మాట్లాడుతూ వచ్చారు. నేరం మాత్రమే చేశారు, నిబంధనలు మాత్రమే పాటించలేదు తప్ప, అవినీతికి పాల్పడలేదు, అటువంటప్పుడు అసలు ఏసీబీ కేసుని విచారించడానికి ఏ రకంగా అర్హత ఉంటుంది, ఇలాంటి ఆర్గ్యుమెంట్ కూడా బిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చేస్తున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


