బీహార్‌లో గడిచిన రెండు దశాబ్దాలుగా పరిపాలన చేస్తున్నారు నితీష్ కుమార్.

బీహార్‌లో గడిచిన రెండు దశాబ్దాలుగా పరిపాలన చేస్తున్నారు నితీష్ కుమార్. బీహార్‌ని ఏలుతున్నారు రెండు దశాబ్దాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా , ఆయన కొన్నిసార్లు భారతీయ జనతా పార్టీతో కలిసి, కొన్నిసార్లు కాంగ్రెస్- ఆర్జేడిలతో కలిసి, బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. తన అవసరాలకు అనుగుణంగా అటు బిజెపీని, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని వాడుకొని బీహార్ ని ఏలుతున్నారు. అటువంటి నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇప్పుడు నడుస్తోంది. నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తోంది. భారతీయ జనతా పార్టీ బీహార్‌లో నితీష్ కుమార్ ది పెద్ద పార్టీ, భారతీయ జనతా పార్టీది చిన్న పార్టీ, ఇటువంటి భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్‌ల మధ్య స్నేహం సఖ్యత పూర్తి స్థాయిలో ఉందా అంటే అవసరాల మేరకే ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఆత్మీయంగా, ప్రేమగా హృదయాలు కలిసేలా ఆ రెండు పార్టీలు పని చేయట్లేదు.

బీహార్‌లో అందరికీ తెలిసిన విషయం దేశంలో రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఈ నేపథ్యంలో ఇక నితీష్ కుమార్ ని బీహార్ నుంచి పంపించేద్దాం నితీష్ కుమార్ ని ముగించేద్దాం నితీష్ కుమార్ లేకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సర్కార్‌ను ఏర్పాటు చేద్దాం అని భారతీయ జనతా పార్టీ, చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు కనబడుతుంది 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేస్తే, భారతీయ జనతా పార్టీ 110 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కంటే, జెడియు కనీసం ఒకటి రెండు స్థానాల్లో అయినా ఎక్కువగా పోటీ చేస్తుంది అని అందరూ భావించారు. దాని మీద పెద్దగా డిస్ప్యూట్ కూడా ఎవరికీ లేదు, బీహార్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళంతా కూడా నాచురల్ గా నితీష్ నేతృత్వంలోని జేడియూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది, బిజెపీ కొన్ని స్థానాలైనా జేడీయూ కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ, జేడియూ ఈక్వల్ గా 101- 101 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఇద్దరూ కూడా ఒకే నెంబర్ సీట్లు తీసుకోవడం ద్వారా, మేము నితీష్ కంటే తక్కువ కాదు, నితీష్ మాకంటే ఒక్కటి కూడా ఎక్కువ ఒక్క సీటు కూడా ఎక్కువ కాదు, నితీష్ ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ నేరుగా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On
ehatv

ehatv

Next Story