తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయిలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో, ఆ ఉపఎన్నికలు జరగబోతున్న నియోజక వర్గాల పైన ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేసింది. 10 మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. అనర్హత వేటు పడుతుందని బిఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అనర్హత వేటు పడుతుందనే ఆందోళన ఆ ఎమ్మెల్యేల్లో కూడా కనబడుతుంది. అనర్హత వేటుపడితే ఎలా అనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ 10 నియోజక వర్గాలని టార్గెట్ చేసి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటనలు, వరుస సమావేశాలు చూస్తున్నాం. జూబ్లీహిల్స్‌తో మొదలు పెట్టి, శేరిలింగంపల్లి పరిధి వెళ్లారు ఆయన, అలాగే గద్వాల్లో మీటింగ్ పెట్టుకున్నారు, సో అనేక చోట్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజక వర్గాల్లో, ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకుంటూ, అక్కడ క్యాడర్‌ని సమాయాత్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు వస్తాయో లేదో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, స్థానిక ఎన్నికలకు మాత్రం రంగం సిద్ధమైంది.
మరి కాసేపట్లో నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి షెడ్యూల్ రాలేదు కానీ మరి కాసేపట్లో షెడ్యూల్ రాబోతుంది లాంటి సమాచారం ఉంది సో స్థానిక ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం ఎలా, స్థానిక ఎన్నికల్లో గెలవడం ఎలా, స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే, ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్, బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందనే చర్చ, కేవలం చర్చగానే ఉంటుంది. సో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇలాంటి మెసేజ్ వెళ్తే, పార్టీకి రాజకీయంగా ఇబ్బంది అని బిఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీలు ఒకసారి ప్రజలకి గుర్తు చేయాలనే ఆలోచన చేస్తుంది. ప్రతి వ్యక్తికి. ప్రతి ఇంటికి. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిస్ ఏంటి. అమలు చేయంది ఏంటి. గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే బాకీ కార్డు. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటి, అమలు చేయనిది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల కాలంలో మీకు ఎంత బాకీ పడ్డదో చూడండి, ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడింది అంటూ, ప్రతి ఇంటికి ఒక బాకీ కార్డుని, బిఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళబోతోంది. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన మోసం ఇది అంటూ చెప్పబోతుంది. ఆల్మోస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో బిఆర్ఎస్ పార్టీ దీనిని అమలు చేసేందుకు దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇది ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ ని ఇచ్చే వాతావరణం కనపడుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు ఆ బిఆర్ఎస్ పార్టీని కాదని, కాంగ్రెస్ కి ఓటు వేయడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి పెన్షన్ల పెంపు కార్యక్రమం. మరొకటి కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తారని, మరొకటి ఆ రైతు కూలీలకు కూడా 12 వేల రూపాయలు మేము ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్ బాకీ కార్డుపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
