Journalist YNR : బీఆర్‌ఎస్ సభ సక్సెస్ వెనుక ఆ 'కీలక' నేత..!
ఈనెల 27న బీఆర్‌ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభ జరిగిన తీరు తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.

ఈనెల 27న బీఆర్‌ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభ జరిగిన తీరు తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.
మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తమైంది. సక్సెస్ తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. అయితే ఈ సభ సక్సెస్ వెనుక ఎవరున్నారు. బీఆర్‌ఎస్ గతంలోనూ అనేక సభలు నిర్వహించింది. అయితే గతంలో లేని ప్రత్యేకత ఇప్పుడు ఎందుకు వచ్చింది. సభ సక్సెస్ వెనుక పూర్తి బాధ్యతలు కేటీఆర్(KTR) చూసుకున్నారని బీఆర్‌ఎస్(BRS) శ్రేణుల నుంచి వచ్చింది. సభ తేదీని ప్రకటించినప్పుటి నుంచి కేటీఆర్ అనేక జిల్లాలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాయకత్వంతో కో-ఆర్డినేట్ చేసుకున్నారు. సభ ఏర్పాట్లపై నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లతో టోటల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎన్నో సభలు నిర్వహించారు. వరంగల్(Warangal)లో మొదటి సభ, అలాగే కరీంనగర్‌లో మరో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఆ సభలకు తెలంగాణ ఆకాంక్ష ఉన్నవారు, ప్రజా సంఘాలు, జేఏసీలు,తెలంగాణ(Telangana) కావాలని కోరుకునేవారు, లెఫ్టిస్టులు, బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించినవారే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా వచ్చేవారు. అప్పట్లో ఆ సభలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సభకు ఓ ప్రత్యేకత ఉంది. 14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉండి సభలు నిర్వహించడం వేరు, ప్రతిపక్ష హోదాలో సభలు నిర్వహించడం వేరు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన సభ సక్సెస్‌కు కారణమేంటి.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ...
