దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు ఒక కొత్త ఎజెండాతో ముందుకు రావడం ఎన్డిఏ సర్కార్‌కు ఎప్పటినుంచో అలవాటుగా మారింది.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు ఒక కొత్త ఎజెండాతో ముందుకు రావడం ఎన్డిఏ సర్కార్‌కు ఎప్పటినుంచో అలవాటుగా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కొన్ని తాయిలాలు ఇవ్వడం బడ్జెట్లలో చూస్తూ ఉన్నాం. గడిచిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఎట్టి పరిస్థితిలో విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తూ వచ్చింది.

కేంద్రంలో మూడోసారి మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం కంటిన్యూస్‌గా ఓడిపోతూ రావడం అనేది బీజేపీకి కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో గెలవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రకరకాల ప్రణాళికలు వేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు లిక్కర్ స్కాం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైలుకి పంపించడం కావచ్చు.. ఢిల్లీ సర్కారు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయింది. ఇలాంటి ఒక క్యాంపెయిన్ చేయడం కావచ్చు దానికంటే ముందు దాంతో పాటు ప్రధానంగా ఎన్నికల తేదీలకు కొద్ది రోజుల ముందు 12 లక్షల వరకు ఆదాయపు పన్నుని తగ్గిస్తూ.. ఆదాయ పన్ను లేకుండా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రధానంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైంది. ఢిల్లీ ఎన్నికల్లో అది ఒక గేమ్ చేంజర్ గా మారిపోయింది. 12 లక్షల వరకు స్లాబ్‌ని ఎత్తేయడంతో 12 లక్షల వరకు టాక్స్ కట్టే అవసరం లేదు అని చెప్పడంతో మధ్య తరగతి ప్రజలు.. అలాగే ఉద్యోగులు వన్ సైడెడ్‌గా భారతీయ జనతా పార్టీ వైపు నిలిచారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు లాంటి ఇంప్రెషన్ కనపడింది. ఎన్నికల ఫలితాల్లో కూడా అదే చూశాం. భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ కాలం తర్వాత దాదాపురెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఢిల్లీలో గెలవగలిగింది. ఎన్నికలకు ముందు ఇటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్సో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ప్యాకేజీలు ప్రకటించడం ద్వారానో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అటువంటి ప్రయత్నమే ఇప్పుడు బీహార్‌లో కూడా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రధానంగా పేద వర్గాలను గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలని ఆకట్టుకోవడానికి సంబంధించి ఏం చేయొచ్చు అనే దానిపైన దృష్టి పెట్టింది.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


Updated On 3 July 2025 1:00 PM GMT
ehatv

ehatv

Next Story