YS Bharathi Reddy : టార్గెట్ భారతిరెడ్డి..గొయ్యి తవ్వుకుంటున్న కూటమి
ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు ఒక వికృత క్రీడని మొదలు పెట్టింది.

ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు ఒక వికృత క్రీడని మొదలు పెట్టింది. కూటమి సర్కారు ఇటువంటి వికృత క్రీడ మొదలు పెట్టినట్టు వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలియదు కానీ, తమ గొయ్యి తామే తవ్వుకుంటుంది కూటమి సర్కారు. ఆంధ్రప్రదేష్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిని టార్గెట్ చేసింది కూటమి. మీడియా కూటమీ, సోషల్ మీడియా మొదటిసారి కాదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం టార్గెట్ గా గడిచిన దశాబ్దం, దశాబ్దంన్నర కాలంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా నెగిటివ్ వార్తలు రాస్తూనే ఉన్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు రాస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పైన వార్తలు రాశారు, విజయమ్మ పైన వార్తలు రాశారు విజయమ్మ బైబిల్ పట్టుకొని క్యాంపెయిన్ చేస్తున్నారు అంటూ, ఆమెకి నెగిటివ్ గా ట్రోల్స్ వార్తలు రాశారు, ఆ తర్వాత వైఎస్ షర్మిలా పర్సనల్ లైఫ్ ని తప్పుపడుతూ, పర్సనల్ లైఫ్ లో ఇంకేదో ఉంది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ గా వార్తలు రాశారు లాంటి ఆరోపణలు వైఎస్ షర్మిలనే చేశారు. ఇప్పుడు వైఎస్ భారతీ రెడ్డి టార్గెట్ గా వార్తలు రాస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో షర్మిల, విజయమ్మ అసోసియేట్ అయిలేరు కాబట్టి వాళ్ళని వదిలేసి మొత్తం ఎఫర్ట్ అంతా భారతి రెడ్డి పైన పెట్టారు. భారతి రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, భారతి రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తరహా వార్తలు రాస్తున్నారు. ఈ తరహా వార్తలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రాశారు, కానీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీడియాగా వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసులో భారతి రెడ్డి ప్రమేయం ఉంది అంటూ ఒక నేరేషన్‌ను బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె ప్రమేయంతోటే హత్య జరిగింది అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమెకి హత్య విషయం ముందే తెలుసు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు.
ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి సంబంధించి ఐదేళ్ల కాలం పని చేస్తూ వచ్చారు. మరి కొంతమంది తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మరి కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ,జనసేననాని దీంట్లో పెద్దగా నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు కానీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా భారతి రెడ్డి టార్గెట్ గా ఇటువంటి విమర్శలను చేస్తూ వచ్చారు. భారతి రెడ్డి క్యారెక్టర్ గురించి, భారతి రెడ్డి బిహేవియర్ గురించి కూడా పర్సనల్ గా ఆఫ్ ది రికార్డ్ మాటల్లో కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ని చేస్తూ, ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడం వల్ల, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల భారతీ రెడ్డి పైన చేసిన విమర్శలని, అధికార పార్టీగా కొంతమంది పైన కేసులు పెట్టగలిగారు కానీ, ఆ క్యాంపెయిన్ మాత్రం ఆపలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న సమయంలో కూడా. ఆ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి గురించి కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీలో మాట్లాడారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత అసెంబ్లీని బైకాట్ చేసి బయటికి రావడం దానిపైన చంద్రబాబు సతీమణి రాష్ట్రమంతా తిరిగి తనకు అన్యాయం అన్యాయం జరిగింది అంటూ మాట్లాడడం, మాట్లాడిన తర్వాత అదే కారణంతో ఓట్లు అడగడం, నారా లోకేష్ కూడా నా తల్లిని అవమానించారు, అంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి చెప్పడం దానిని ప్రజలు యక్సెప్ట్ చేయడం, ఒక మహిళను అవమానిస్తారా అంటూ ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోయి వైసార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం చూశాం. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా భువనేశ్వరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటో ఈ క్షణానికి, తేల్చలేకపోయింది కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీ రికార్డుల నుంచి, భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారో తెలుసుకొని ఆ రికార్డుల నుంచి తొలగించాల్సి ఉంది, భువనేశ్వరి పైన అసెంబ్లీలో తప్పుడు ప్రచారం తప్పుడుగా మాట్లాడారు అనేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు , ఆయన భార్య రాష్ట్రవ్యాప్తంగా తిరిగి చెప్పిన మాట. మరి ఇప్పుడు జరిగేదేంటి.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


