Babu Serious on Centralgovt: కేంద్రంపై చంద్రబాబు అసహనం..!
కేంద్రంపై చంద్రబాబు అసహనం..!

కేంద్ర ప్రభుత్వంపైన టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నారా, అసహనం వ్యక్తం చేస్తున్నారా, అంటే లోపల ఎక్కడో అసహనం ఉందేమో, అది అప్రయత్నంగా బయటికి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఏంటి చంద్రబాబు అసహనం, నీకు మాత్రమే కనిపించిన అసహనం వైఎన్ఆర్ అంటే, నిన్న చంద్రబాబు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత, ఆయన ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు, కేసులు ఈ అంశాలని బేస్ చేసుకొని మాట్లాడుతూ, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ విచారణ పూర్తి కావాలంటే, ఇంకా 30 ఏళ్ళు పడుతుంది అనే మాట అన్నారు. ఈ మాట వెనక ఆయన లోపల ఉన్న అసహనం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉంటాయి. ఇంకో నెలలో, రెండు నెలలో జైలుకి పోతారు. గడిచిన 12 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతూ వస్తున్న మాటలు. ఇవి చార్జ్ షీట్ ఫైల్ చేశారు , విచారణలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, విచారణలు ఆలస్యం చేయకుండా, తొందరగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించేసేయండి. ఈ తరహా ప్రకటనలు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా, ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా, ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నారు. ఆయన జైలుకి వెళ్తున్నారు. భారతి రెడ్డి సీఎం అవుతారు, లేకపోతే వైసీపీలో ఆ అంతర్యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం కోసం యుద్ధం మొదలైంది, ఇటువంటి వార్తల్ని కూడా చూశాం మనం. రేపో, మాపో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పరితిపాలన పెట్టబోతున్నారు లాంటి వార్తలని కూడా చూశాం. వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు, భారతీ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు లాంటి వార్తలని కూడా చూశాం. అప్పుడు ఆ వార్తలు వేస్తున్న సందర్భంగా, మాటలు మాట్లాడుతున్న సందర్భంగా, వాళ్ళంతా చెప్పిన మాట కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో, అమిత్ షాతో, మోదీతో, జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది, ఈ కారణంగానే కేసుల నుంచి బయటపడుతున్నారు, అరెస్ట్ కాకుండా బయటపడుతున్నారు, ఆయన్ని అరెస్ట్ కాకుండా ఉండడం వెనక, రీజన్ భారతీయ జనతా పార్టీ అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ అవినాష్ రెడ్డికి ఇష్యూ సంబంధించిన ఇష్యూ కూడా, మీందరికీ గుర్తుంటుంటుంది, కర్నూల్లో అవినాష్‌రెడ్డి అరెస్ట్ చేయకుండా సిబిఐ అక్కడికి వస్తే కూడా పంపించేశారు. సిబిఐ కూడా భయపడి పారిపోయింది పోలీసులకి, కేంద్ర ప్రభుత్వం, మోదీ, అమిషాలే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, కాపాడుతూ వస్తున్నారు అంటూ మాట్లాడడం కూడా చూశాం. ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో ఏన్డీఏ సర్కార్ ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వినాలి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమానికి నిధులు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రయారిటీ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి అది అయిందా అంటే కనిపించట్లే, ఎందుకంటే అమరావతికి ఒక అర్ధ రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కనపడలే, గ్రాంట్ రూపంలో పోలవరానికి అడిషనల్ గా ఒక రూపాయి కేంద్రం ఇచ్చినట్టు కనపడలే, పైగా పాత అంచనాల ప్రకారమే పోలవరం కట్టుకోండి, ఎస్కలేషట్స్ కి అవకాశమే లేదు అని చెప్పింది. జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


