Laddu Controversy: లడ్డూ వివాదం-సిట్ నివేదికపై నోరు మెదపని చంద్రబాబు-పవన్..!

తిరుమల లడ్డు కల్తి అంశానికి సంబంధించిన రాజకీయ వివాదాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ. ఆరోపణ మాత్రమే కాదు, ఆయన చెప్పిన వాస్తవం ఇది. ఆయన చెప్పిన మాట సరిగ్గా, ఆయన మీడియా ముందే, తిరుమల లడ్డులో జంతువులను కొవ్వు కలిపే పరిస్థితిలోకి వచ్చారు కడాన అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూశాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలపడం ఏంటి అంటూ నిర్ఘాంతపోయారు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది, దేశ ప్రజలంతా శ్రీవారి భక్తులంతా కూడా తిరుమలలో ఇటువంటి అపచారం జరిగిందా అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత చలించిపోయారు. మరింత ఆవేదనకు గురయ్యారు. ఆయన ఆలయ మెట్లని కడిగారు, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానన్నారు, సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు, తిరుపతిలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం తిరుమల శ్రీవారిని అవమానించింది అని చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ చేసింది అని చెప్పారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపింది అని చెప్పారు. జంతువుల కొవ్వు కలిపిన లక్ష లడ్డూల్ని అయోధ్యలోని శ్రీరామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా అక్కడికి పంపించారు. శ్రీరాముడి ఆలయాన్ని కూడా తిరుమల లడ్డుతో కల్తీ చేశారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి న్యాయపరమైన వివాదం చూశాం. కోర్టులకు వెళ్లడం చూశాం. సుప్రీంకోర్టు ఈ వివాదం పైన విచారిస్తున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది, ఏ ఆధారాలతో జంతువుల కొవ్వు కలిసిందనే విషయాన్ని మీరు చెప్పారు అని ప్రశ్నించింది, ఏ ఆధారాలు ఉన్నాయో చూపించండి, ఇటువంటి ప్రకటనలు ఇంకా చేయకండి, దీనిపైన ఎవరు మాట్లాడకండి అంటూ సుప్రీం కోర్ట్ చెప్పింది. సిబిఐ ఆధ్వర్యంలో, సిబిఐ అండర్‌లో ఒక సీట్ ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించింది, ఆ సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. నివేదిక చూసిన తర్వాత, ఆ నివేదికలో జంతువుల కొవ్వు కలిపారు అనే అంశానికి సంబంధించి ఎటువంటి ఫైండింగ్ కూడా కనిపించట్లేదు, నెయ్యి కల్తి జరిగింది అనే దానికి సంబంధించిన ఫైండింగ్ ఉంది, నెయ్యిలో కెమికల్స్ కలిపారు అనే దానికి సంబంధించిన ఫైండింగ్ సిట్ రిపోర్ట్ లో ఉంది, కానీ జంతువుల కొవ్వు కలిపారు అనే అంశానికి సంబంధించిన ఫైండింగ్ ఏది, సిట్ ఐడెంటిఫై చేయలేకపోయింది. సుదీర్ఘ విచారణ చేశారు, అనేక డాక్యుమెంట్స్ ని పరిశీలించారు, వందల మందిని విచారించారు, వందల రోజుల పాటు సమయం తీసుకున్నారు, అనేక రికార్డులని క్రోడీకరించిన తర్వాత, టిటిడి ఈ ప్రొక్యూర్మెంట్ లో పని చేస్తున్న వాళ్ళని కూడా విచారించిన తర్వాత, సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట లేదు, కానీ నెయ్యి కల్తి జరిగింది అనే మాట మాత్రం ఆ రిపోర్ట్ లో ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పుడు నెయ్యి కల్తి జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించిన చర్చ కంటే, జంతువుల కొవ్వు కలిపారు అనే అంశమే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను శ్రీవారి భక్తుల్ని ఆందోళనకు గురి చేసింది కాబట్టి, ఆ అంశం ఫస్ట్ క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది, సిట్ రిపోర్ట్ తర్వాత అయినా, సీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా, దాంట్లో జంతువుల కొవ్వు కలిపారని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి గాని, జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి గానీ, జంతువుల కొవ్వు కలిపిన లడ్డూల్ని అయోధ్య రామ మందిరం దగ్గరికి పంపించారు అని చెప్పిన ఉపముఖ్యమంత్రి గాని, బయటకవచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. గతంలో అపచారం జరిగిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు, అపచారం జరిగిందని ఆందోళన చెందిన వాళ్ళు, అపచారం గత ప్రభుత్వమే చేసింది అని మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు తామే ఏర్పాటు చేసిన సిట్, తామే సెలెక్ట్ చేసిన అధికారులు విచారించి, ఓ వాస్తవాన్ని బయట పెడితే, ఆ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా, లేదా తేలాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చెప్పిన ఆ ఒక్క మాట నిజమనో, అబద్ధమనో చెప్పే పరిస్థితిలో అటు చంద్రబాబు నాయుడు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గాని ఉన్నారా లేదా తేలాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్లుగా జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటన చేయగలరా, నేను చెప్పినట్టుగానే జంతువుల కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిన లడ్డూల్ని అయోధ్యకు పంపించారు అనే ప్రకటన పవన్ కళ్యాణ్ ఈరోజు చేయగలరా, లేదు ఆ ప్రకటన చేయలేకపోతే మేము గతంలో చెప్పినవి అబద్ధం, మాకు వచ్చిన ఏదో రిపోర్ట్ ఆధారంగా చెప్పాం ఇప్పుడు ఆ విచారణ చేసి తేల్చింది జంతువుల కవ్వు కలవలేదని, కాబట్టి గతంలో మేము మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాం, ఈ మాటైనా చెప్పగలరా, ఈ మాటని చెప్పాల్సిన అవసరం ఉందా, లేదా, రాజకీయాలు రాజకీయ పార్టీలుగా చేసుకోండి, విమర్శలు ఒకరి పైన ఒకరు ఏ స్థాయికి దిగజారి విమర్శలు చేసుకున్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ విమర్శలు ఏమైనా చేసుకోండి కానీ, దీనిలోకి శ్రీవారిని ఎందుకు లాక్కొచ్చారు, శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కూడా ఎందుకు వివాదం చేశారు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి భక్తులంతా , అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అనే మాట ఏ ఆధారం లేకుండా చెప్పడానికి ఎందుకు సాహసించారు. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On 29 Jan 2026 7:01 AM GMT
ehatv

ehatv

Next Story