తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాల గురించి రెండు రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం.

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాల గురించి రెండు రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ కాంగ్రెస్‌లో తలా ఓ దారిలా మారిపోయారు. తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ పాలచన అవుతోంది అని, తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును చూస్తే, కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతోందా, సర్కస్ నడుపుతోందా అని అనిపిస్తుంది. ఈ విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన బిఆర్ఎస్ పదే పదే చేస్తుంది, సర్కార్ నడపడంలేదు, సర్కస్ నడుపుతుంది అని, బిఆర్ఎస్ విమర్శలకు బలం చేకూర్చేలా, బిఆర్ఎస్ విమర్శలని నిజం చేసేలా, బిఆర్ఎస్ విమర్శలకు న్యాయం చేసేలా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిహేవ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వంలో బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు, మాట్లాడుతున్న మాటలు, మంత్రులు మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత, ఇది సర్కార్ కాదు, సర్కస్సే అని ఎవరికైనా అనిపిస్తుంది. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీలో వర్గాలు విభేదాలు, కూటములు కొత్త ఏం కాదు, కానీ ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం కొట్టుకోవడం అనేది దేశంలో ఇంకెక్కడ చూడలేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడలేదు, ఉద్యమం సమయంలో 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ సర్కార్ ఉన్నా కాంగ్రెస్ సర్కార్లో కొట్లాటలు, గ్రూపులు ఇవి చూడలేదు. ఓన్లీ తెలంగాణ-ఆంధ్ర వివాదంగానే అప్పుడు చూశాం. కానీ తొలిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఈ స్థాయిలో గొడవలు పడి రోడ్డును పడడం చూస్తున్నాం. ఈ రోడ్డున పడ్డది కూడా దేనికోసం, తమ ఆధిపత్యం కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రభుత్వ విధానాలకు సంబంధించి విభేదాలో కాదు, పంపకాలకు సంబంధించిన విభేదాలు, వసూళ్లకు సంబంధించిన విభేదాలు, పనులకు సంబంధించిన విభేదాలు, డబ్బులకు సంబంధించిన విభేదాలు, ఈ మాట కూడా నేను చేస్తున్న ఆరోపణ కాదు, కనబడుతోంది.

మంత్రి కొండా సురేఖ మాటలను చూసిన తర్వాత, కొండా సురేఖ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, కాంగ్రెస్‌లో మంత్రులు ఏ స్థాయిలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, డబ్బుల కోసం ఎలా కొట్టుకుంటున్నారో అర్థమవుతుంది. సమక్కసారక్క జాతరకు సంబంధించిన పనులు తన కంట్రోల్‌లో జరగాలి, తన నిర్ణయం ప్రకారం జరగాలి అని, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కోరుకున్నారు కానీ, ఆ పనుల్ని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులకు ఇప్పించుకున్నారు అనేది కొండా సురేఖ ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్క సారక జాతర పనులు పర్యవేక్షణకి వెళ్ళిన సందర్భంగా ఆ సమావేశానికి కూడా ఆమె వెళ్ళలేదు, వెళ్ళకపోవడం వెనక నిరసనే కారణమని వార్తలు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 60 కోట్లు, 70 కోట్ల వరకు వర్కులకు కక్కుర్తి పడేవాడిని కాదు నేను అని అక్కడ మాట్లాడడం చూశాం.

నిన్న ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి అక్కడ ఒక నిందితుడు ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేస్తామంటూ ఇంటి దగ్గర హడావుడి చేయడం చూసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తిగా పోయింది. కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడడం కాదు, డ్రైనేజ్ లో కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఢిల్లీ నాయకత్వం చూస్తున్నారో లేదో తెలీదు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక ఇంచార్జ్ ఉన్నారు, ఆమె ఏం చేస్తున్నారో తెలీదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు టెండర్ల విషయంలో రోడ్డునపడి కొట్టుకునేదాకా వస్తే, ఓ మంత్రి ఇంటి పైకి అదే సర్కారుకు సంబంధించిన పోలీసులు మఫ్టీలో వెళ్లి, వ్యక్తులని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే, ఏ వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం అయితే పోలీసులు వెళ్ళారో, ఆ వ్యక్తిని ఒక మంత్రి తన కార్లో ఎక్కించుకొని ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానని, తీసుకెళ్ళిపోవడం చూస్తుంటే, ఇది సర్కారు అని డెఫినెట్ గా అనిపించదు కదా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అధినేత ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు అనే భయం కానీ, ఆ ముఖ్యమంత్రి పట్ల బాధ్యత కానీ ఏ ఒక్క మంత్రికి ఉన్నట్టు కనపడట్లే. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ..


Updated On
ehatv

ehatv

Next Story