అధికారంలో ఉన్నాం మాకు నచ్చింది చేస్తాం, మీరు అడిగితే సమాధానం చెప్పం, గట్టిగా అడిగితే దబాయించేస్తాం, ఇది ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారుకు సంబంధించిన అజెండాగా కనబడుతుంది.

అధికారంలో ఉన్నాం మాకు నచ్చింది చేస్తాం, మీరు అడిగితే సమాధానం చెప్పం, గట్టిగా అడిగితే దబాయించేస్తాం, ఇది ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారుకు సంబంధించిన అజెండాగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపైన, గత ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులు కొట్టివేత కార్యక్రమం ప్రారంభమయింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత. ఆయన క్రమంగా ఆయన పైన నమోదైన కేసులని ఆయనే కొట్టివేసేలా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన వార్తలు వస్తున్నాయి, ఆయన పైన కేసులు కొట్టివేశారు, అంటూ రోజు వార్తలు చూస్తున్నాం. కేసు పెట్టిన వాళ్లే పొరపాటు ఏం జరగలేదు అని కేసులు విత్‌ డ్రా చేసుకుంటున్నారు అంటూ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటివరకు దీనిపైన అఫీషియల్‌గా మీడియా ముందు ఎక్కడా స్పందించలేదు. ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆయన జైల్ కి వెళ్ళాడు, దానితో పాటు లిక్కర్ కేస్ నమోదయింది, దాంతో పాటు ఫైబర్నెట్ కేస్ కూడా ఉంది.

లిక్కర్ కేసులో చంద్రబాబు సర్కారు నిర్ణయం కారణంగా, 5300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది అనేది ఎక్సైజ్ శాఖ చెప్పిన మాట. లెక్కల్లో కూడా కనపడుతున్నాయి, చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రివిలెజ్ ఫీజ్ రద్దు నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు 5300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని, ప్రివిలేజ్ ఫీజ్ రూపంలో బార్ల ఓనర్లు, వైన్ షాపుల ఓనర్లు కట్టాల్సిన ఫీజ్ ని చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖకు తెలియకుండా క్యాబినెట్ కి తెలియకుండా రద్దు చేశారు. ఇది అభియోగం, రద్దు చేసింది నిజం. 5300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది నిజం. ఇలా జరిగిందని కంప్లైంట్ చేసింది నిజం .విచారణ చేసింది నిజం. చార్జి షీట్ ఫైల్ చేసింది నిజం. ఇప్పుడు అదేం జరగలేదని కంప్లైంట్ చేసిన ఆయన కేసు వెనక్కి తీసుకుంటున్నాడు కాబట్టి, కేసుని లేకుండా చేసింది ఏసీబీ కోర్ట్. సేమ్ ఫైబర్ నెట్ అంశంలో కూడా అలాగే జరిగింది, ఎవరైతే ఫిర్యాదు చేశారో, మధుసూధన్ రెడ్డి ఫిర్యాదు చేసిన వ్యక్తే కేసు ఏం లేదు అని ఇప్పుడు వెళ్లి కేసు వెనక్కి తీసుకున్నారు కాబట్టి, కేసు రద్దయిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారంట.

ఈ చిట్ చాట్ లో ఆయన చెప్పారంట, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసులు కొట్టేస్తారా, అలా అయితే జగన్మోహన్ రెడ్డి పైన కేసులన్నీ కూడా పోయాయి కదా, అలా సాధ్యమవుతుందా , ఆధారాలు లేవు కాబట్టే కేసులు కొట్టేస్తారు అని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడారట. ఆయన చిట్ చాట్ లో మాట్లాడారఅనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు ప్రధానంగా ప్రచురిస్తూ వచ్చాయి. ఏమని చంద్రబాబు ఇలా అన్నారు, ముఖ్యమంత్రి అయితే కేసులు కొట్టేస్తారా, ఏమి లేవు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి నిబంధనలు పాటించలేదు కాబట్టి, చట్టానికి వ్యతిరేకంగా పెట్టారు కాబట్టి కేసులు తీసేసారు, కొట్టేసారు అని ఆయన మాట్లాడినట్టుగా తెలుగుదేశం పార్టీ పత్రికలు రాశాయి. కేసుల అంశంపై చంద్రబాబు వ్యాఖ్యల పట్ల సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story