రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరగబోతుంది అంటూ రెండు మూడు రోజులుగా వార్తలు చూశాం.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరగబోతుంది అంటూ రెండు మూడు రోజులుగా వార్తలు చూశాం. ఆ మీటింగ్ ఈరోజు జరిగింది పూర్తయింది. మీటింగ్ పూర్తి అయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, తర్వాత మీటింగ్ తర్వాత మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అర్థమైంది. ఇది ఒక పనికి మాలిన మీటింగ్ అని, ఇదొక పనికి మాలిన మీటింగ్‌గా కనిపించింది.

ఈ మీటింగ్‌కు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు అని అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక డయాస్ ఇచ్చిందంట, వీళ్ళద్దరు కూర్చొని మాట్లాడారంట, కేంద్ర ప్రభుత్వం ఒక అప్పిలేట్ అథారిటీగా మాత్రమే ఉంటుంది, దీనిలో మేము మాట్లాడిన అంశాల్లో మేము మాట్లాడిన అజెండాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు అంటున్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేనప్పుడు హైదరాబాద్ పిలిచి ప్రగతి భవన్‌లో, విజయవాడకు పోయి అక్కడ సెక్రటేరియెట్‌లోనో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు సరే అది పక్కన పెడదాం, ఒక నాలుగు కీలకమైన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ని మేము పరిష్కారం చేశామని మీటింగ్ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు.

ఏంటి ఒకటి అంటే నీటి విడుదలకు సంబంధించి గోదావరి పైన, కృష్ణ పైన ఏ ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్ ఏ కెనాల్స్ ద్వారా ఎంత వెళ్తుంది అనే దానికి సంబంధించి కెనాల్స్ స్టార్టింగ్ లో, మేము నీటికి సంబంధించిన కొలతలు తీసుకుంటున్నాము.దానికి సంబంధించిన టెలీ మెట్రీలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. టెలీమెట్రీలు ఏర్పాటు చేసి అలకేట్ చేసిన స్థాయిలోనే ఆయా రాష్ట్రాలు వాటర్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం టెలీమెట్రీ మిషన్స్ పెట్టడానికి సంబంధించి ఒప్పందం జరిగింది అని చెప్పారు. చాలా అద్భుతమైన ఒప్పందంగా దీన్ని చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలకు సంబంధించిన అంశంలో టెలీ మెట్రీలు పెట్టుకోవడానికి ఏపీ ఒప్పుకోవట్లేదనో, టెలీ మెట్రీ పెట్టట్లేదనో చర్చ కూడా మనం ఎక్కడ వినుండం, ఎక్కడో అడప దడప నాగార్జున సాగర్ దగ్గర కొట్లాటలు జరిగినప్పుడు తప్ప. సో అది ఒక పెద్ద సమస్య దాన్ని ఈరోజు పరిష్కరించినట్టుగా చెప్తున్నారు. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story