Journalist YNR : జగన్ బాటలో బాబు..! పులివెందుల సాధించి చేసేదేంటి.. 'YNR' ఎనాలసిస్..!
ఆంధ్రప్రదేష్‌లో పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల తీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారా అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేష్‌లో పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల తీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాట ఏంటి, చంద్రబాబు నాయుడు అటువైపు వేస్తున్న అడుగులు ఏంటి అంటే, గతంలో కుప్పంను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు. కుప్పంలో గెలవబోతున్నాం అంటూ చెప్తూ వచ్చారు. కుప్పంలో గెలవడానికి సంబంధించి సీరియస్‌గా ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. కుప్పంలో వైసీపీని గెలిపించండి, గెలిచిన భరత్‌ని మంత్రిని చేస్తాను అంటూ చెప్పారు. కుప్పం మున్సిపాలిటీని గెలిచేశారు. సో వీటన్నిటిని గెలిచే క్రమంలో కుప్పంని వైసీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది. కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయడానికి సంబంధించి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. గతంలో రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ పులివెందుల వైపు పెద్దగా చంద్రబాబు నాయుడు కన్నెత్తి చూసేవాళ్ళు కాదు, కుప్పం వైపు పెద్దగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నెత్తి చూసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేష్‌లో జగన్ కుప్పంని టార్గెట్ చేస్తే, చంద్రబాబు నాయుడు పులివెందులని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది.
పులివెందుల జెడ్పిటీసి ఎన్నికని కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే దీనికి ఒక ఉదాహరణగా చూడొచ్చు. కూటమి సర్కారు పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల్లో గెలవడం ద్వారా సాధించేది ఏమైనా ఉంటుందా అంటే, కచ్చితంగా దాని ద్వారా సాధించేది ఏమి ఉండదు, కానీ పులివెందుల్లో మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం, అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. సో ఈ ఏడాది కాలమో, రెండేళ్ల కాలమో దాన్ని క్యాంపెయిన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు, మీ సొంత ఊర్లో పులివేందుల్లోనే మేము గెలిచాం చూడండి అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఇది పొలిటికల్ ప్రెస్టేజ్ కోసం పనికొస్తుంది తప్ప, పొలిటికల్ సస్టైనబిలిటీకి మాత్రం కూడా ఉపయోగపడే పరిస్థితి ఉండదు, ఎందుకంటే గతంలో కుప్పంలో మున్సిపాలిటీలు గెలిచి కుప్పంలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో పోటీ చేయడానికే భయపడుతుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో భారీగా విజయాలు నమోదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.
నంద్యాలలో భారీగా డబ్బులు ప్రవహింపచేసి, నిన్న మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు నాతో ఇంటర్వ్యూలో చెప్తూ కొన్ని విషయాలు రైజ్ చేశారు, ఆయన చెప్తున్న దాని ప్రకారం, నంద్యాల బై ఎలక్షన్ లో కొంతమంది అధికారులు తీసుకెళ్లి డబ్బులు పంచారు, అధికారులే ఓటర్లకు డబ్బులు పంచారు, సో ఆ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్నంతా దుర్వినియోగం చేసి, డబ్బులు పంచి నంద్యాల బై ఎలక్షన్ లో గెలిసి, ఆ తర్వాత కొన్ని నెలల్లో జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. సో అధికారంలో ఉన్న పార్టీలు ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ పోయి గెలిచినా, వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత నష్టం కూడా చవి చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంని టార్గెట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అటువంటి నష్టాన్ని చవి చూశారు. ఇప్పుడు పులివెందల్లో వైసీపీ ని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు కూడా అదే అదే తరహా అదే స్థాయిలో నష్టాన్ని చవిచూసే పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
