ఆంధ్రప్రదేష్‌లో గ్రామ సచివాలయాల పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనపడింది.

ఆంధ్రప్రదేష్‌లో గ్రామ సచివాలయాల పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనపడింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటి అంటే క్రమంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ వచ్చింది. గతంలో వాలంటీర్ల పైన ఏ రకమైన దుష్ప్రచారాన్ని అయితే చేస్తూ వచ్చిందో, అదే తరహా దుష్ప్రచారాన్ని ఇప్పుడు గ్రామ సచివాలయాల పైన చేస్తుంది. గ్రామ సచివాలయాలు ఎగ్జిస్టెన్స్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడని భయపడుతుందో, కారణం ఏంటో తెలియదు కానీ, గ్రామ సచివాలయాల పేరు మార్పుకు సంబంధించి ప్రయత్నం చేసింది. విజన్ యూనిట్స్ గా వాటిని మార్చబోతున్నాం, పేరు కూడా మార్చుకుంటున్నాం, విజన్ యూనిట్స్ గా పెట్టబోతున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. గంటల వ్యవధిలోనే అటువంటిది ఏం లేదు వాటిని, విజన్ యూనిట్ గా పని చేయిస్తాం, కానీ పేరు మేము మార్చట్లేదు అంటూ ఒక ప్రకటన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. ప్రస్తుతానికి గ్రామ సచివాలయాల పేరు మార్పు లేదు అనే ప్రకటన వచ్చినప్పటికీ, గ్రామ సచివాలయాలు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారనే భయం మాత్రం కూటమిలో కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు గ్రామ సచివాలయాల్ని ఏం చేస్తే బాగుంటుంది, వాటిపైన ఒక తప్పుడు ప్రచారం ఎలా చేద్దాం, తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న ఒక మోడ్ ఆఫ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ చేస్తూ చేస్తూ తర్వాత దాన్ని లేకుండా చేస్తుంది.

వాలంటీర్ల విషయంలో అది చూశాం. వాలంటీర్లు ఇంట్లో ఎవరు మగాళ్లు లేని టైం లో వచ్చి తలుపులు కొడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఊరు తిరిగి చెప్పారు. వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుందని చెప్పారు, వాలంటీర్లు ఒక సంఘ విద్రోహ శక్తులు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్లు మహిళల అక్రమ రవాణకు కారణం అవుతున్నారు అని చెప్పారు. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయడం ద్వారా ఎన్నికలకు ముందు మళ్ళీ మేము వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఎత్తేశారు, వాలంటీర్ల వ్యవస్థ లేకుండా అద్భుతంగా పని చేస్తున్నామని ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్న దాన్ని క్రమంగా ఒక తప్పుడు ప్రచారం చేసి ఏ రకంగా లేకుండా చేస్తారు, అనేదానికి ఒక ఎగ్జాంపుల్. తాజాగా గ్రామ సచివాలయాల పైన దృష్టి పడింది. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులంతా పని లేకుండా ఉన్నారు.16 వేల మంది ఎంతో ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది ఆ రిక్రూట్ అయిన తర్వాత వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయినోళ్ళు కొంతమంది, జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేక, జాయిన్ అవ్వని వాళ్ళు పోతే దాదాపు లక్ష6 వేల మంది ఎంతో గ్రామ సచివాలయాలో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.గ్రామసచివాలయాల పట్ల కూటమి సర్కార్‌ వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


Updated On
ehatv

ehatv

Next Story