Ambedkar Statue in Vijayawada : అంబేద్కర్ పై అశ్రద్ధ..
విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది గత సర్కారు.

విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది గత సర్కారు.206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం అంబేద్కర్‌కు ఇచ్చిన గౌరవం. ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఆ విగ్రహం దగ్గర ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. నిత్యం సామాజిక అంశాలపైన అక్కడ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు అంబేద్కర్‌కి సంబంధించి, ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలతో, అక్కడ అనేక పుస్తకాలను కూడా అందుబాటులోకి ఉంచారు.
అదొక స్మృతివనం తరహాలో ఏర్పాటు చేశారు. విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం విజయవాడకు ఒక కీర్తి పతాకంగా నిలబడిపోయింది. గతంలో 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన టిడిపి, అమరావతి ప్రాంతంలో అంబేద్కర్‌కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ఆ ఏర్పాటు దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలవ్వలేదు, దీంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, విజయవాడ నడిబడ్డునే అమరావతి ప్రాంతంలో, ఎక్కడో కాకుండా విజయవాడ నడిబడ్డున స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ కి ఇటువంటి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. దానిలో భాగంగానే ఓ భారీ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహం ఏర్పాటు సందర్భంగా కూడా చాలా వివాదం నడిచింది, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని కొంతమంది వ్యతిరేకించారు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎలా పెడతారు అంటూ మాట్లాడారు, వాళ్ళ లోపల ఒక వివక్ష ఉన్నప్పటికీ, పైకి మాత్రం నగరంలో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు, బయట ఎక్కడన్నా పెట్టండి అంటూ సన్నాయి నొక్కులని నొక్కడం చూశాం. అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేదనే మాట పైకి చెప్పకుండా, లోలోపల వ్యతిరేకిస్తున్న వాళ్ళని గతంలో చూశాం. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిడియట్‌గా ఆ అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఉన్న నేమ్ ప్లేట్స్ ని తొలగించే ప్రయత్నం చేశారు.దాన్ని తొలగించారు, అర్ధరాత్రి లైట్లు బంద్ చేసి అక్కడికి వెళ్లి వాటిని తొలగించడం తర్వాత, దాన్ని రాజకీయ వివాదంగా కూడా చూశాం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దానిపైన ఆందోళన చేయడం కూడా చూశాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఆ విగ్రహం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదా అనిపిస్తుంది, కారణం ఏంటో తెలియదు, ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ పట్ల వివక్ష ఉంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పార్టీ పట్ల, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల వివక్ష ఉందేమో, బహుశా గత ప్రభుత్వం పట్ల, గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ పట్ల మీకు కోపం ఉందేమో, వివక్ష ఉందేమో, ఆ పార్టీ పెట్టిన విగ్రహాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటున్నారేమో, ఆ పార్టీ విగ్రహం పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్లి దాన్ని మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే, ఆ పేరు ఆ పార్టీకో, ఆ ప్రభుత్వానికి వస్తుంది, తప్ప మనకి రాదు కదా అని భావిస్తుందేమో, కారణం ఏంటో తెలియదు కానీ, ఆ విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తోంది కూటమి సర్కారు.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


