జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చేస్తుంది.

జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన సంబరాలు చేస్తుంది. జీఎస్టి తగ్గింపు అనేది దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన వరంగా చెప్తూ వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి కర్నూల్‌లో ఒక భారీ సభని ఏర్పాటు చేసి మనా జీఎస్టీ సంబరాలు చేసుకుంటున్నాం అంటూ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా GST తగ్గింపుని ఒక పండగలా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత మేలు జరిగింది, జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఏ మేరకు మేలు జరిగింది అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అంటూ అసెంబ్లీలో మాట్లాడడం,కేంద్ర ప్రభుత్వానికి సన్మానం చేయాలంటూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాట్లాడడం చూశారు. జీఎస్టీ తగ్గింపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని కూడా తగ్గించేస్తుంది, ఆ మాటకు వస్తే గడిచిన 16 నెలల కాలంలో జీఎస్టీ విపరీతంగా తగ్గుతూ వస్తుంది. జీఎస్టీకి సంబంధించిన స్లాబ్ లు తగ్గింపు కంటే ముందు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జీఎస్టీ తగ్గుతూ వస్తుంది. మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే లీస్ట్ పర్ఫార్మర్‌గా ఉంటూ వస్తుంది. జీఎస్టీ వసూళ్లలో, జీఎస్టీ వసూలు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించింది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, జీఎస్టీ పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గుతూ వస్తుంది.

ఆ తగ్గుదల రేటు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఉంటూ వస్తుంది. తాజాగా జీఎస్టీకి సంబంధించిన స్లాబ్ లు తగ్గించడంతో ఆ జీఎస్టీ ఆదాయం మరింత పడిపోతున్నట్టు కనపడుతుంది. సెప్టెంబర్ కు సంబంధించిన ఆదాయం చూసినా, అలాగే ఆ అక్టోబర్ కి సంబంధించిన ఆదాయం చూస్తే కూడా ఆ పర్టికులర్ నెలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే 300 కోట్ల రూపాయలకుపైగా జీఎస్టీ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిపోయింది.ఇక అక్టోబర్‌కు సంబంధించి చూస్తే మరో 160-170 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతున్నట్టు కనపడుతుంది. ఈ రకంగా ఆదాయం తగ్గుతూ పోతే ఎట్లా, గతంలో తగ్గుతున్న దానితోటే ఇబ్బందులు పడుతూ వచ్చాం, ఇప్పుడు జీఎస్టీ స్లాబ్లు తగ్గింపు కారణంగా మరింతగా జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుందిజ దీనికి ఆల్టర్నేటివ్స్ వెతకండి, దీనికి ఆల్టర్నేటివ్ గా మనం ఏం చేయాలి అదనపు ఆదాయ సేకరణ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కొత్త భారం వేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కొత్త భారం వేయటం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలనుకుంటుంది. అవసరమైతే ఇంకొంత ఆదాయాన్ని కూడా సేకరించాలనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారుల పైన కూడా ఈ ట్యాక్స్‌ల పేరుతో వసూళ్లు పెంచే కార్యక్రమం చేస్తుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story