రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి.. రాజకీయాలు మారుతుంటాయి. రాజకీయపార్టీలను మారుస్తుంటారు. రాజకీయపార్టీలు విధానాలు.యూటర్నులు తీసుకుంటాయి.

రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి.. రాజకీయాలు మారుతుంటాయి. రాజకీయపార్టీలను మారుస్తుంటారు. రాజకీయపార్టీలు విధానాలు.యూటర్నులు తీసుకుంటాయి. ప్రభుత్వాలు యూ టర్న్ తీసుకుంటాయి. ఇటువంటి యూటర్న్ ప్రస్తావన వస్తే ఎక్కువగా గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబునాయుడు. అప్పటికప్పుడు అవసరాలను బట్టి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) యూ టర్న్ తీసుకుంటాడు. ఇందుకు చాలా సందర్భాలు ఉన్నాయి.
2014లో బీజేపీ(BJP)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు అదే 2019 వరకు వచ్చేసరికి బీజేపీని ప్రపంచంలో ఏ పార్టీ లేనంతగా బీజేపీని భూతం పార్టీగా, దయ్యం పార్టీగా చూపించారు. ఆంధ్రప్రదేశ్(AP) ప్రజలకు బీజేపీని విలన్‌గా చిత్రీకరించారు. ఐదేళ్లు గడిచేలోగా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎదుట బేలగా మారారు, సాగిలా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అనుకూలం, రెండు కళ్లు అంటూ గడిపారు.
ఎన్నికల హామీల విషయంలో కూడా చంద్రబాబు చాలా సార్లు యూటర్న్‌లు తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక అసలు వాలంటీర్ల వ్యవస్థనే రద్దు అయిందని మాట మార్చారు. సూపర్ సిక్స్‌ను 2024 జూన్‌లో అమలు చేస్తామన్నారు, యూటర్న్ తీసుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు వాదన డబుల్ స్టాండర్డ్‌గా ఉంది..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
