ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు ఏం చెప్పాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదు. ఏం చేద్దాం అనుకుంటుందో ఆంధ్రప్రదేష్‌ ప్రజలకు తెలీదు

ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు ఏం చెప్పాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలీదు. ఏం చేద్దాం అనుకుంటుందో ఆంధ్రప్రదేష్‌ ప్రజలకు తెలీదు, ఆంధ్రప్రదేష్‌లో గత సర్కార్ సమయంలో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అప్పటి సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన ప్రతిపక్షాలు మాట్లాడడం కొత్త ఏం కాదు, తప్పేం కాదు, ప్రభుత్వాలు చేసిన తప్పులని ప్రశ్నించాల్సిందే, ప్రభుత్వాలు చేసిన తప్పులని ఎత్తి చూపాల్సిందే, ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని ప్రజల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలని చైతన్యం చేసి, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి. దాన్నేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో అధికారంలో ఉన్న, గతంలో అధికారంలో ఉన్న పార్టీ పైన, తప్పుడు ప్రచారం చేశాయి, తప్పుడు మాటలు మాట్లాడాయి, అబద్ధాలు ప్రచారం చేశాయి, ఆ అబద్ధాలని నిజమని, ఇప్పుడు కూడా మమ్మల్ని నమ్మండి అని, మమ్మల్ని నమ్మండి, అంటూ బ్రతిమాలుతున్నాయనా, కన్విన్స్ చేస్తున్నాయనా లేకపోతే బెదిరిస్తున్నాయని అనాలో, గత ప్రభుత్వ హాయంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళలు విదేశాలకు అక్రమంగా తరలించబడ్డారు, అని ఓ పార్టీ అధినేత ప్రస్తుత కూటమి భాగస్వామి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. అధికారంలోకి రావడానికి ముందు ఆయన ప్రతి సభలోనూ 30 వేల మంది మహిళలని విదేశాలకు పంపించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వాలంటీర్లు సమాచారం ఇచ్చారు, ఆ సమాచారం మేరకు వైసీపీ నాయకులు ఎక్కడైతే ఒంటరి మహిళలు ఉన్నారో, లేకపోతే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో, మహిళలని గుర్తించి వాళ్ళని విదేశాలకు తరలించారు, ఈ విషయాన్ని నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, ప్రజలకు చెప్పండి అని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి, అని కూడా ఆయన చెప్పారు. దానిపైన చాలా పెద్ద ఎత్తున కలకలం ఇవన్నీ చూశాం. కేంద్ర ప్రభుత్వం NCRB రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ అయిన మహిళలకు సంబంధించిన గణాంకాలు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. నిజమే నిజమే నిజమే నిజమే అంటూ దాన్ని ఎలక్షన్ వరకు కంటిన్యూ చేశారు, ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే, ఆయన దగ్గర ఆన్సర్ లేదు, 30 వేల మంది ఏమైపోయారు, 15 నెలలు అవుతుంది 30 మందిని కూడా తీసుకురాలేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే తయారయ్యారు, చంద్రబాబు నాయుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు, పవన్ కల్యాణ్‌ అధికారంలోకి రాకముందు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత, ఏమైంది చంద్రబాబుకి అని అనిపిస్తుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


Updated On
ehatv

ehatv

Next Story