ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి, మూర్ఖంగా ముందుకే వెళ్ళాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి, మూర్ఖంగా ముందుకే వెళ్ళాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశం పైన రివ్యూ నిర్వహించారట. ఆ రివ్యూలో చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకే వెళ్ళాలి, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాల్సిందే, అప్పగించాలని మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారంట. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాలేజీలను, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, కాలేజీలకు సంబంధించి టెండర్లను పిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

ఆదోని మినహా మిగతా మూడు కాలేజీలకి ఏ ఒక్కరు కూడా టెండర్ దాఖలు చేయలేదు. ఆదోనికి హైదరాబాద్ కి సంబంధించిన కిమ్స్ అనే సంస్థ ఒక్కటి మాత్రమే టెండర్లు దాఖలు చేసింది. టెండర్లు రాకపోవడానికి కారణం ఏంటి అనేది మంత్రి ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి మరో మాట చెప్పారు, మంత్రి చెప్పిన మాట కొంతమంది బెదిరించారు కాబట్టి, ఎవరు వీటిలో టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు అంటూ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. చాలా మంది టెండర్లు వేయొద్దని బెదిరించారు, టెండర్లు వేస్తే రద్దు చేస్తామని బెదిరించారు, నాకు ఫోన్ చేసి కూడా బెదిరించారు, కొంతమంది అంటూ నేరుగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ మాట్లాడడం నిన్న చూశాం. ముఖ్యమంత్రి రివ్యూలో అధికారులు చెప్పిన మాట ఇంకా అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలని, మరోసారి బిడ్డర్లు కోరుతున్నారు కాబట్టి, అక్కడ ఫీల్డ్ విజిట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. మళ్ళీ టెండర్లు పిలవాలని అడుగుతున్నారని, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారట. ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చింది అదే అయితే ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి, ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంట అంటే, లేదు లేదు వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేద్దాం, మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించండి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమైతే పెంచండి, 30% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది, అది ఇవ్వండి. ఏదో రకంగా బ్రతిమాలాడండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకు కాలేజీలు అప్ప చెప్పండి ఇది ముఖ్యమంత్రి చెప్పిన మాటగా కనపడుతుంది. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story