విశాఖపట్టణంలో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీస్ అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

విశాఖపట్టణంలో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీస్ అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జనాలు ఎవరూ లేకుండా కేవలం 10 వాహనాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల్సి ఉంది, రోడ్డు మార్గంలో కానీ అన్ని వాహనాలు ఎలా వచ్చాయి, నేషనల్ హైవే పొడువున ప్రయాణికులకు, ఆ రోడ్డులో ప్రయాణం చేస్తున్న వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా వైసీపీ కి సంబంధించిన నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికైనా ఇబ్బందులు వస్తే వైసీపీ నాయకుల పైన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు హెచ్చరించారు. కానీ అంత జనం ఎలా వచ్చారు, అంతమంది జనాల్ని అక్కడ పోగేస్తుంటే, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ అధికారులు పటిష్టంగా ,సమర్ధవంతంగా వ్యవహరించకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆ స్థాయిలో జనాలు వచ్చారు అనేది, ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. అక్కడ స్థానిక పోలీస్ అధికారుల పైన, జిల్లా అధికారుల పైన ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లుగా సీరియస్ అయినట్లుగా సమాచారం అందుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన ఎక్కడ పడితే, అక్కడ ఆగిపోయి, అక్కడికి వస్తున్న వాళ్ళ వినతులు తీసుకుంటూ, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ, వాళ్ళతో గడుపుతూ, వాళ్ళని దగ్గర తీసుకొని, వాళ్ళతో మాట్లాడుతూ, మొత్తం ర్యాలీగా అన్ని కిలోమీటర్లు వెళ్తుంటే పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీసులు కంట్రోల్ చేసి ఉండాల్సింది కదా, కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా, ఆయన పర్యటనకు చాలా పెద్ద ఎత్తన ప్రచారం జరుగుతోంది. ఆయన చుట్టూ జనాలు వస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించి, పొగాకు రైతులకు సంబంధించిన అంశంలో ,మామిడి రైతులకు సంబంధించిన అంశంలో, ఓ కార్యకర్త పరామర్శకు సత్తెనపల్లి వెళ్ళిన సందర్భంలో, గుంటూరు మిర్చి మార్కెట్ కి వెళ్ళిన సందర్భంలో, అనేక సందర్భాల్లో పర్యటనకు అనుమతి లేని సందర్భంలో, జనాలు చాలా పెద్ద ఎత్తున రావడం చూశాం.

నర్సీపట్నం పర్యటన 60 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో కూడా జనాలు రాకుండా, జనాలు లేకుండా పర్యటన జరగాల్సి ఉంది. అలాగే జరుగుతుందంటేనే మీరు అనుమతించారు. అయినా జనాలు ఎందుకు వచ్చారు, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్థాయిలో జనాలు వస్తుంటే అబ్సర్వ్ చేయలేకపోయారు, గమనించలేకపోయారు, ఆపలేకపోయారు, ఆపి ఉండాల్సింది కదా, ఆపాల్సిన అవసరం ఉంది కదా , ఎందుకు ఆపలేకపోయారు, ఇదే ముఖ్యమంత్రి అసహనంగా కనపడుతుంది. పైగా అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కలిసారు, ఆయనతో మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ కార్మికులు అంతమంది వచ్చి కలిసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంటే, వాళ్ళని ముందే ఆపి ఉండాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చింది, మెడికల్ కాలేజ్ సందర్శనకు, దానికి మాత్రమే అనుమతి ఉంది. మధ్యలో వేరే ఎవరో, వేరే స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చి కలుస్తుంటే ఎందుకు అనుమతించారు? వాళ్ళని కలిసే అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story