ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పవన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు పవన్ స్పందించకపోవటం కూటమిలో సంచలనంగా మారుతోంది. తన ఫోన్‌కు దొరకడం లేదని చంద్రబాబు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో చెప్పారు. పవన్ కల్యాణ్‌ నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్పిన మనోహర్. పవన్ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల యాత్రలో భాగంగా కొచ్చి చేరుకున్నారు. అసలు కూటమిలో ఏం జరుగుతోందనే చర్చనీయాంశంమైంది. ఈనెల 6 న కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. నిన్న మంత్రులు, సెక్రెటరీల కాన్ఫరెన్స్ కి పవన్ గైర్హాజరయ్యారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడాన్న పవన్ కల్యాన్‌ దూరంగానే ఉన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story