సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటేవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా మారిపోయింది.

సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటేవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా మారిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు దేశ ప్రజలు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే కేసులు తీసుకుంటుందేమో, వాళ్ళ దగ్గర నుంచే కేసులు వెళ్తాయేమో, కేంద్ర హోం శాఖనే వాళ్ళకి కేసులు డైరెక్ట్ చేస్తుందేమో కానీ, విచారణ ఎలా చేయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, నిందితులు ఎవరో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, ఎవరి మీద కేసు పెట్టాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, ఎవరిని అరెస్ట్ చేసి లోపల వేయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, ఎవరికీ ఎప్పుడు బెయిల్ ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, ఏ కేసుని ఎంత కాలం సాగదీయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, ఏ కేసుని ఎప్పుడు నిద్ర పుచ్చాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు, బట్ ఇప్పుడు అది జరుగుతున్నట్లు కనపడుతుంది. నాకు మాత్రమే కదా చంద్రబాబు నాయుడికి కూడా అదే కనపడుతుంది.

నిన్నటికి నిన్న ఆయన ఏపీలో కల్తి మద్యం అంశం పైన విచారణ కోసం సీట్ ని ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడిన ఒక మాట ఆసక్తికరంగా అనిపించింది. ఆయన కొంతమంది ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి సిబిఐ విచారణ కావాలంటున్నారు, సిబిఐ విచారణ అంటే టైం పాస్ చేయొచ్చు, కాలక్షేపం చేయొచ్చు, సిబిఐ విచారణకు ఇస్తే అని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా కేసుల్లో కాలక్షేపం చేస్తున్నారు కదా అలాగే సిబిఐ కి ఇచ్చేస్తే తప్పించుకొని కాలక్షేపం చేయొచ్చుని అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో సిబిఐ విచారణ అనేది ఒక కాలక్షేపం సిబిఐ అనేది ఒక పనికి మాలిన సంస్థ, నిందుతులు ఎవరో పట్టుకోలేదు, సిబిఐ కేసులు ఏంటో తేల్చలేదు, జస్ట్ టైం పాస్ చేస్తుంది మాత్రమే చంద్రబాబు నాయుడు అనుకున్న మాట, అందుకోసమే సిబిఐ కి బదులు మేము సిట్ ఏర్పాటు చేసి తొందరగా విచారణ చేస్తాం అంటూ కల్తి మద్యం పైన సిట్ ఏర్పాటు చేశారు. ఆయన గతంలో ఐదేళ్ల కాలంలో, ఆయన అనేక సందర్భాల్లో సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 60-70 అంశాల్లో సిబిఐ విచారణ చంద్రబాబు నాయడు డిమాండ్ చేశారు. 60-70 అంశాల్లో సిబిఐ విచారణ చేయాలంటూ లేఖలు రాశారు. సిబిఐ విచారణ కోరారు ఆంధ్రప్రదేశ్‌లో గుడుల దహనం, గుడుల ధ్వంసం దగ్గర నుంచి, వివేకానంద రెడ్డి సంబంధించిన కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో అనేక కేసుల్లో సిబిఐ విచారణ ఎందుకు చేయరు, సిబిఐ విచారణ ఎందుకు చేయరు అంటూ ఆయనే పదే పదే మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాకపోయినప్పటికి, చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు సంబంధించిన స్పాన్సర్డ్ మీడియా పదే పదే రాస్తూ వచ్చింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On
ehatv

ehatv

Next Story