Journalist YNR : జగన్ అంటే భయపడుతున్న మంత్రులు.. ఎందుకా భయం
నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్‌పీకారు.

నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్‌పీకారు. చాలా మంత్రులపై చాలా సీరియస్ అయ్యారు, మీరేం చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంటే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు, మీరెందుకు ప్రజల దగ్గరికి దీన్ని తీసుకెళ్లలేకపోతున్నారు, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ప్రభుత్వం పైన ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంటే, మీకు ఎవరికీ నోరు ఎందుకు రావట్లేదు అంటూ చాలా సీరియస్ అయ్యారు. నిజానికి చంద్రబాబు నాయుడు మంత్రుల పైన మాట్లాడడం అనేది ఇంత సీరియస్ అవ్వడం అనేది బహుశా ఇది మొదటిసారి కావచ్చు, చాలా సందర్భాల్లో ఆయన సీరియస్ అయ్యారు, మాట్లాడారు అంటూ వార్తలు చూస్తూ ఉంటాం కానీ, నిన్నటి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా మంది సీనియర్ మంత్రులకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. తమ అధినేతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటూ వాళ్ళ వాళ్ళు చర్చించుకోవడం వినిపించింది.
కొత్తగా ఉన్న మంత్రులకి వాళ్ళు ఒకసారిగా హతాశులు అయి ఉంటారు, వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి ఈ స్థాయిలో తమపై సీరియస్ అయ్యారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండి ఉంటారు. కానీ సీనియర్ మంత్రులకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోప్పడం చాలా కొత్తగా అనిపించింది. గతంలో ఎప్పుడూ లేనిదిగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి కూటమి, సర్కారు చేసిన తప్పులను, కూటమి సర్కారుకి సంబంధించిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆ సీరియస్ ఎఫర్ట్ ని అడ్డుకోవడంలో భాగంగా ప్రభుత్వం వైపు నుంచి అటాక్ పెద్దగా కనిపించట్లే, ఒకటి రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, నారా లోకేష్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు.
హోంమంత్రి అనిత అడప దడప మాట్లాడడం చూస్తూన్నాం. మిగతా మంత్రులకు సంబంధించిన సౌండ్ ఎక్కడా వినిపించట్లా కనపడట్లే. నిజానికి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు కూడా మూడు పార్టీల కూటమే అధికారంలో ఉన్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షతగా ఉన్న సమయంలో, ఏ స్థాయిలో మంత్రులు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు దాడి చేసేవాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాతేస్తాం, నరికేస్తాం ఇంకేదో చేస్తాం ,ఇంకేదో చేస్తాం, అంటూ జగన్మోహన్ రెడ్డిని ఏక వాక్యంతో అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేయడం చూశాం. ఈవెన్ అప్పుడు అసెంబ్లీలో మంత్రులు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బూతుల దాడి చేసే ప్రయత్నం చేసినా అప్పుడు సభలో ఉన్న నాయకులంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేశారు. అప్పుడు మంత్రులు పేర్లు ప్రజలందరికీ గుర్తుంటాయి, అటాక్ చేసిన మంత్రులు ఎవరో ప్రజలందరికీ గుర్తుండి ఉంటాయి.
ఆ సమయంలో అంత అటాక్ చేసిన మంత్రుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలు జీవితం గడిపారు, జైలుకు వెళ్లి వచ్చారు. అదే సమయంలో వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ టార్గెట్‌గా కూడా అదే తరహాలో విమర్శలు చేస్తూ వచ్చారు. అలా విమర్శలు చేస్తూ వచ్చిన నాయకులు ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం జైలుకు వెళ్ళడం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా వైసీపీ కి సంబంధించిన ఫలానా నేత పైన తొందరలో కేసు పెట్టబోతున్నారు, ఫలానా నేత పైన తొందరలో కేసు పెట్టబోతున్నారు, ఒక ఐదు మంది 10 మంది నాయకుల పేర్లు ఇప్పటికీ వినపడుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళంతా కూడా వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపిని టార్గెట్ చేశారు. టిడిపి చెప్తూ వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తామని, కొంతమంది సంగతి తేలుస్తోంది, కొంతమంది పైన అక్రమ కేసులు పెడుతోంది, అరెస్టులు చేయిస్తుంది, కొంతమంది పైన బెయిల్స్ రాకుండా పీటీ వారంట్ వేసి ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు కూటమిలో ఉన్న మంత్రుల ఆలోచన ఏంటి అంటే, కూటమిలో ఉన్న మంత్రుల భయం ఏంటి అంటే, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మనం టార్గెట్ అవ్వకూడదు అని అనుకుంటున్నారట. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..
