CM Revanth: CM Revanth.. this is the argument..!

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట అంశానికి సంబంధించి తెలంగాణలో అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల దాడి చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో సొంత జిల్లాకు, తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా దక్షిణ తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు, ఆంధ్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన డిపిఆర్‌ని వెనక్కి పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘటించలేకపోయింది ఇలాంటి విమర్శలను చూస్తున్నాం. 90 టీఎంసిలతో నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని 45 టీఎంసిలకే కుదించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైంది కాదు అంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడం చూస్తున్నాం. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి కోసం నీటిని తీసుకోవాలనే ఆలోచన కేసిఆర్ సర్కార్ చేయడం సరైనది కాదు అంటూ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న వాదనలో నిజం లేదు. జూరాల దగ్గర నీటి లభ్యత కంటే శ్రీశైలం దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉంది అంటూ టిఆర్ఎస్ పార్టీ చెప్పడం చూస్తున్నాం. జూరాల ప్రాజెక్టు కిందనే యాసంగికి నీరు లేక క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది, అదే శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే, ఆ పరిస్థితి మనకు ఉండదు అంటూ బిఆర్ఎస్ పార్టీ చెప్పడం చూస్తూన్నాం. ఈ మొత్తం వ్యవహారంలో నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజా ప్రతినిధులు అంతా కలిసి ప్రగతి భవన్లో సమావేశమై, ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈ అంశం పైన మాట్లాడుతున్న దానిలో ప్రధానంగా రెండు, మూడు ఇష్యూస్ ని వాటర్ సంబంధించిన ఇష్యూ, చాలా టెక్నికల్ ఇష్యూ సాధారణ ప్రజలందరికీ అర్థం కావడం కోసం నేను ఒక రెండు. మూడు విషయాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఆయన పదే పదే చెప్తూ వస్తున్న మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్న మాట, కేసిఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో 299, 512 టీఎంసిలకు ఒప్పందం చేసుకున్నారు, సంతకాలు పెట్టారు, కేసీఆర్ అది తెలంగాణ పాలిట మరణ శాసనం అయింది. కృష్ణా జిల్లాలో 299 టీఎంసిలు మాకు చాలు అని కేసిఆర్ చెప్పారు అనేది రేవంత రెడ్డి చేస్తున్న వాదన. దీనికి కౌంటర్ గా బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట మేము తాత్కాలిక అడ్జస్ట్మెంట్ లో భాగంగా, వన్ ఇయర్ కోసం పెట్టిన సంతకమే అది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు కాబట్టి, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం కోణంలో, మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి రాష్ట్రాల్లో మధ్య నీటి పంపకానికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటయింది. 2014లో ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, కొత్త రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాల్సి ఉంది, ఆ కేటాయింపులు జరిగేలోపు ఏ ఏడాదికి ఆ ఏడాది ఒక అగ్రీమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు 299-512 టీఎంసిలకు సంతకం పెట్టాల్సి వచ్చింది అంటే 512 టీఎంసిలకు సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే ప్రాజెక్టులు నిర్మాణమై ఉన్నాయి, 299 టీఎంసిల నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మితమై ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో నిర్మితమైన ప్రాజెక్టుకు సంబంధించి ఎంత నీరు కావాలి అని ఉంది అనేదాన్ని బేస్ చేసుకొని ఆ నీటికి సంబంధించిన యూటిలైజేషన్ కోసం ఇబ్బంది రాకుండా ఉండం కోసం, 299 కి మేము సంతకం పెట్టామనేది కేసిఆర్ చెప్తున్న మాట. పైగా నీటి కేటాయింపులు అనేది ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత లీగల్ అవుతాయి, తప్ప కేవలం రెండు రాష్ట్రాలు కూర్చొని చేసుకునే అగ్రీమెంట్ తాత్కాలికమే అవుతుంది, పర్మనెంట్ కాదు అనే మాట కూడా చెప్తున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story