తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ వేదికగా స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ వేదికగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళద్దరి పైన తీవ్రమైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో వాళ్ళద్దరి పైన విమర్శలు చేయడానికి కారణం, రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్. కేసిఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఈ సర్కార్ అన్యాయం చేస్తోంది. మేము భారీగా నిధులు ఖర్చు పెట్టాం 80 % పైగా పనులు పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీయలేదు, దానికి నిధులు కేటాయించలేదు అంటూ ఆయన విమర్శలు చేశారు. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించిన డిపిఆర్‌ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, అది రిజెక్ట్ చేసింది అనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దాచేస్తుంది, కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి అంటూ గతంలో మేము డిమాండ్ చేసేవాళ్ళం. జాతీయ హోదా విషయం పక్కన పెడితే అసలు కనీసం డిపిఆర్ ని కూడా పట్టించుకోకుండా, డిపిఆర్ ని రిజెక్ట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చాలా పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం ఉండింది. యుద్ధం చేయాల్సిన అవసరం ఉండేది, ప్రజల దగ్గరికి అంశాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉండింది కానీ, ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దానివల్ల రంగారెడ్డి, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు తీవ్రమైన నష్టం జరగబోతుంది. ఈ నష్టం ఈరోజు మాత్రమే జరిగేది కాదు, భవిష్యత్తుకు కూడా ఇది తీరని లోటుగా ఉండబోతుంది అంటూ ఆయన మాట్లాడారు. కేవలం పాలమూరు రంగారెడ్డి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా, ప్రాంతానికి భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే తాను బయటికి వచ్చాను, ఇకపైన ప్రజల్లోనే ఉంటాను, రెండేళ్ల సమయం ఇచ్చాము. ఈ ప్రభుత్వానికి రెండేళ్ళు గడిచిపోయింది కాబట్టి, ఇకపైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా చూస్తూ ఊరుకోమంటూ ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి అంశానికి సంబంధించి ప్రధానంగా కేసిఆర్ మాట్లాడిన అంశాలు ఈ సందర్భంగా, కేసిఆర్ తనదైన స్టైల్ లో కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా చూశాం. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూశాం. పక్క రాష్ట్రం దోచుకుపోతుంటే కూడా పట్టించుకోవట్లేదు, వీళ్లు కనీసం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన సోయి లేకుండా పోయింది అంటూ ఆయన మాట్లాడడం చూశాం. ప్రధానంగా మౌళికంగా కేసిఆర్ రైజ్ చేసిన రెండు ప్రధానమైన అంశాలు పాలమూరు-రంగారెడ్డికి నిధులు కేటాయింపు చేయట్లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అన్యాయం చేస్తుంటే స్పందించట్లేదు, మౌళికంగా ఈ ప్రశ్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు నుంచి సమాధానం చెప్పవలసి ఉంది. కేసిఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కొంతమంది మీడియా ప్రతినిధులని పిలిచి చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్ లో కూడా కొన్ని రాజకీయ పరమైన విమర్శలు చేశారు. నిన్న కొడంగల్ వేదికగా ప్రజల మధ్యలో నుండి ఆయన మాట్లాడుతున్న సందర్భంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి ఉండాల్సింది. పాలమూరు జిల్లా నుంచే ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా, పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతోంది, నల్గొండకు అన్యాయం జరుగుతోంది, రంగారెడ్డి జిల్లాకి అన్యాయం జరుగుతుంది అంటూ కేసిఆర్ చెప్పిన మాటల్లో నిజమెంతో, అబద్ధం ఎంతో చెప్పి ఉండాల్సింది.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story