Congress Govt Land Scam : భూముల కథేంటి.. అడ్డంగా దొరికిన ప్రభుత్వం..!
హైదరాబాద్ కేంద్రంగా వేల ఎకరాల భూముల్ని అక్రమంగా తమ వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా వేల ఎకరాల భూముల్ని అక్రమంగా తమ వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది.
ఈ ప్రయత్నం విలువ 5 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పాల్పడుతోందంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజుల క్రితం కొన్ని ఆరోపణలు చేశారు. Hiltp పేరుతో ఒక పాలసీ తీసుకురాబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత, రెండు రోజుల తర్వాత ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంది. నిన్న పత్రికలో ప్రధానంగా వార్తలు చూసాం, క్యాబినెట్ సమావేశం తర్వాత ఆ పాలసీ గురించి, ఆ పాలసీ ఏంటి అంటే హైదరాబాద్ రింగ్‌రోడ్ లోపల, రింగ్ రోడ్ కి దగ్గర సమీపంలో ఉన్న 9,500 ఎకరాలు దాదాపు భూమిని ఆ ప్రైవేట్ కంపెనీల సంబంధించిన వాళ్ళకు ఇచ్చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇవ్వడానికి సంబంధించిన మార్గం సుగమం చేస్తుంది. ఏంటి ఆ భూములన్నీ ఎక్కడివి, గతంలో మూడు దశాబ్దాల క్రితం, నాలుగు దశాబ్దాల క్రితం అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు హైదరాబాద్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టడం కోసం కొంతమందికి భూములు కేటాయించారు.
హైదరాబాద్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ, ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ పొల్యూషన్ కారణంగా, ఆ ఇండస్ట్రీస్ గతంలో ఊరికి దూరంగా ఉండేవి, ఆ ప్రాంతం అంతా, ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి కాబట్టి, ఆ ప్రాంతంలో కంపెనీస్ ఉండడం సరైంది కాదు అనే నిర్ణయంతో, ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే, ఈ కంపెనీస్ అన్నింటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకి తరలించాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ఇంప్లిమెంట్ కాలేదు, ఆ నిర్ణయాన్ని గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే అటువంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశారు, తర్వాత ఆ నిర్ణయం చేసింది. ఆ సమయంలో ఈ భూములన్నీ ఏం చేయాలి అనే దానికి సంబంధించి గత సర్కారు, బిఆర్ఎస్ సర్కారు ఈ భూములకు సంబంధించిన మార్కెట్ రేట్ కంటే 100 నుంచి 200% అధికంగా కేటాయిస్తే, డబ్బులు ఇస్తే ఆ భూములు ఎవరైతే కంపెనీ పెడతామన్న భూములు తీసుకున్నారో, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ఆ భూములకు సంబంధించిన మార్కెట్ రేట్ కంటే 100 -200% ఎక్కువ కట్టిన తర్వాత, ల్యాండ్ కన్వర్షన్ కోసం హెచ్ఎండిఏ కి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కి మళ్ళీ ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో అనుకున్న పాలసీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ భూములన్నిటిని, తక్కువ ధరకు, ఆ ఇండస్ట్రీల వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశాన్ని దయచేసి జాగ్రత్తగా వినండి, తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే నిర్ణయంగా దీన్ని చూడాలి, ఇది కేవలం బిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న గొడవ కాదు, కేటీఆర్ కి, రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న గొడవ కాదు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన గొడవ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన గొడవ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అత్యంత విలువైన భూములు కొంతమంది గద్దలకు కట్టబెట్టే కుట్ర.
9,500 ఎకరాల భూమి హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఉంది అంటే, ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏ స్థాయిలో ఆస్తో, ఒకసారి ఆలోచన చేయండి. ఈ 9500 ఎకరాలు కంపెనీలకు కేటాయించిన సందర్భంగా, ప్రభుత్వాలు పెట్టిన నిబంధన ఫలానా పని కోసం మాత్రమే, ఒక కంపెనీ పెట్టాలంటే, ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇక్కడ జరగాలి, ఆ కంపెనీ సంబంధించిన యాక్టివిటీ కాకుండా, వేరే యాక్టివిటీ, వేరే రకమైన కార్యక్రమాలకు ఈ భూములు వాడకూడదు అనే నిబంధన ఉంటుంది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తేస్తే, ఆ ల్యాండ్ వాళ్ళకి అయిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ బయటకి పరిశ్రమలు తరళించాల్సి వచ్చినప్పుడు, ఇక్కడున్న భూములన్నిటిని ప్రభుత్వమే ఇచ్చింది, ఫలానా కంపెనీ పెట్టడం కోసం ఇచ్చింది, ఆ కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, ప్రభుత్వం ఆ భూములు తీసుకోవచ్చు. ఊరు బయట ఎక్కడో, రింగ్ రోడ్డు బయట వాళ్ళకి అదే స్థాయిలో , రెండు ఎకరాలు ఇక్కడ తీసుకుంటే రెండు ఎకరాలు బయట ఇవ్వచ్చు, ప్రభుత్వం భూములు, అప్పుడు ఈ భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ కంపెనీ యాస్ ఇట్ ఈస్ గా బయటికి వెళ్ళిపోతుంది. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అంతా అక్కడికి వెళ్లి పని చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా, ఇప్పుడు ఈ భూములు మార్కెట్ వాల్యూ కంటే, 30% కే మార్కెట్ లో 100 రూపాయలు ఉంటే 30 రూపాయలకే ఈ భూమి మీకు ఇచ్చేస్తాం, ఆ భూమిలో మీరు కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు, కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు, ఈ భూమిని మీరు వెంచర్లు వేసి అమ్మేసేయండి, విల్లాలు కట్టి అమ్మేసేయండి, టవర్లు లేపి అమ్మేసేయండి, అమ్మేసుకోండి, ప్రభుత్వం ప్రస్తుతం చెప్తున్న మాట అంతే కాదు, 30% మీరు ప్రభుత్వానికి కడితే చాలు, మార్కెట్ రేట్లో మీరు మళ్ళీ వీటిలో, ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి సంబంధించి, హెచ్ఎండిఏకో, మున్సిపాలిటీకో, డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తుంది. ఇంత లబ్ది ఫలానా కంపెనీల వాళ్ళకు ఎందుకు చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం అనేది అనుమానాలకు దారి తీస్తుంది. అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ భూమి మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటే, ఈ భూములు ప్రభుత్వమే వేలం వేసి అమ్మిన ఈ భూమిలో, ప్రభుత్వమే టవర్స్ లేపి అమ్మగలిగిన 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది. హైదరాబాద్‌లో రింగ్ రోడ్ లోపల 10వేల ఎకరాల భూమి అంటే భూమికి సంబంధించిన వాల్యూ ఎంత ఉంటుందో జస్ట్ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. కోకాపేట లాంటి ప్రాంతాల్లో, రింగ్ రోడ్ బయట ఎకర 100 కోట్లు, 130 కోట్లు ప్రభుత్వం వేలం వేస్తేనే పలుకుతుంది ధర. అలాంటిది రింగ్ రోడ్ లోపల అత్యంత విలువైన ప్రాంతంలో 9000 ఎకరాల భూమి అంటే దానికి సంబంధించిన వాల్యూ ఎంతో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే తెలంగాణ సమాజం మొత్తం దీన్ని జాగ్రత్తగా గమనించండి అని కోరుతున్నారు, ఈ 9000 ఎకరాల భూమి ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్నా, 9000 ఎకరాల భూమిలో ప్రభుత్వం టవర్లు నిర్మించో, లేకపోతే ఇంకో రకంగానో దాన్ని అమ్మే ప్రయత్నం చేసినా ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయొచ్చు, ఐటి పార్కులు డెవలప్ చేయొచ్చు, అలా ఐటి కంపెనీలకో, ఇండస్ట్రీస్ కో భూములు ఇక్కడ అమ్మిన 10 లక్షల కోట్ల రూపాయలు సమీకరణ చేయొచ్చు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వరకు ఉన్న మొత్తం అప్పుల్ని తీర్చేయొచ్చు. తెలంగాణని మళ్ళీ సర్‌ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా మార్చుకోవచ్చు, ఈ ప్రయత్నాన్ని వదిలేసి 10 లక్షల కోట్లు వచ్చే దగ్గర మాకు 3000 కోట్లు, 4000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు ప్రభుత్వానికి కట్టండి, మీకంతా మాఫ్ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే, ఎవరికి లబ్ది చేకూర్చడం కోసం తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలి, ఎవరి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలి, పైగా ఈ కంపెనీలు అన్నింటిని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, మాకు 30% కట్టండి, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే ఈ కంపెనీలు ఇక్కడన్న 10 మందితోటో, 20 మందితోటో, 100 మందితో నడుస్తున్న కంపెనీలన్నీ ఈ కంపెనీ నడపడం ద్వారా వచ్చే ఆదాయ కంటే, భూమి అమ్మితేనే ఎక్కువ ఆదాయం వస్తుందని కంపెనీ మూసేస్తాడు, ఉపాధి పోతుంది కదా, కార్మికులకి. నిజానికి అసలు ఈ కంపెనీలకు ఎన్ని భూములు ఇచ్చారు, ఆ భూములకు ఎన్ని సంవత్సరాలకు లీజ్ కి ఇచ్చారు, ఆ లీజ్ పూర్తంయిందా లేదా, పూర్తయితే ఆటోమేటిక్ గా మనం స్వాధీనం చేసుకోవాలి కదా. అది ఇంకా వాళ్ళ దగ్గరే ఎందుకు ఉన్నాయి, కంపెనీలు పెడతామని భూములు తీసుకున్న వాళ్ళు, కంపెనీలు పెట్టకుండా అలాగే ఖాళీగా ఉన్న భూములు కూడా కొన్ని ఉన్నాయి, అసలు ఇవి ఏంటి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయని, లీజ్ పూర్తఅయినవెన్నీ, నడుస్తున్నవెన్నీ, ఇవి కాకుండా పొల్యూషన్ లేకుండా నడిచే కంపెనీలు కొన్ని ఉంటాయి, ఉదాహరణకు చిన్న చిన్న పేపర్ కంపెనీలు, ప్లేట్లు తయారు చేసే కంపెనీలు, గ్లాసులు తయారు చేసే వాటితో పెద్దగా పొల్యూషన్ ఉండదు, అటువంటి కంపెనీలు రింగ్ రోడ్ బయటకి తరలించాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు పొల్యూషన్ ఉండి బయటికి తరలించాల్సిన కంపెనీలు ఏంటి, పొల్యూషన్ లేకుండా ఇక్కడే ఉంచాల్సిన కంపెనీలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి సెగ్రగేట్ చేసి, ఆ తర్వాత కదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఇవేవి చేయకుండానే ఈరోజు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేశాయి.
ఈ పాలసీ తీసుకొస్తున్న విషయం పరిశ్రమ శాఖ మంత్రికి కూడా తెలియదు, క్యాబినెట్ లో అది టేబుల్ అయ్యేవరకు అని, పరిశ్రమల శాఖ మంత్రికి తెలియకుండా, ఆగ మేఘాల మీద, ఆరు నెలల్లో మొత్తం కట్టబెట్టేస్తాం, వారం రోజుల్లో మీరు అప్లై చేసుకొని, మీకు ఇచ్చేస్తామని ప్రభుత్వం అంటుంటే, అనుమానాలు రాక, ఏమి వస్తాయి, ఈ పాలసీ కారణంగా, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆదాయానికి వచ్చే లాభం ఏంటో ప్రభుత్వం చెప్పగలుగుతుందా. ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి పొల్యూషన్ కంపెనీల్ని, రింగ్ రోడ్ బయటకి తరలించాలనే ఉద్దేశం వచ్చినప్పుడు, అటువంటి చర్చ జరిగినప్పుడు, అటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేసినప్పుడు, ఫార్మాసిటీ అని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫార్మాసిటీ ప్రయత్నం చేసింది, ఎందుకోసం ఫార్మాసిటీలో మొత్తం ఫార్మా కంపెనీలన్నీ అక్కడే ఉంటే, పొల్యూషన్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయి, కాబట్టి పొల్యూషన్ ని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది, మేనేజ్ చేయడం, మేనేజ్మెంట్ ఈజీ గా ఉంటుంది, పొల్యూషన్ మేనేజ్మెంట్ అని అన్నిటిని ఒక దగ్గర పెట్టడం కోసం, ఫార్మసిటీ అని పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మసిటీ రద్దు అనేసింది. ఈ కంపెనీలన్నిటికీ ఫార్మాసిటీలో ల్యాండ్ ఇస్తేచ ఫార్మాసిటీకి కంపెనీలన్నీ పొల్యూషన్ కంపెనీలు తరలిస్తే, ఈ భూమి అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా, కంపెనీ పెడతామని భూములు తీసుకుని, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండిని ప్రభుత్వం ప్రోత్సహించడం ఏంటి, ఎవరి ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తీర్చే అవకాశం ఉన్న ఈ భూమిని, కొంతమంది కోసం, కొంతమంది ప్రయోజనాల కోసం ఇస్తామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఎట్లా. ఇప్పటికే ఇలా తీసుకున్న భూములు అనేకమంది దగ్గర చేతులు మారాయి, రిజిస్ట్రేషన్ కాకుండా, ప్రైవేట్ అగ్రీమెంట్స్ పేరుతో చాలా మంది దగ్గర నుంచి చేతులు మారాయి. ఈ భూములు అసలు ఎవరి దగ్గర ఉన్నాయి, మనం ఫలానా వ్యక్తికి భూమి కేటాయించాం, ప్రభుత్వం వైపు నుంచి అతని దగ్గర అసలు భూమి ఉందా లేదా, అతని దగ్గర నుంచి ఎవరికి పోయింది, తర్వాత ఎవరికి పోయింది, ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి,ఇవన్నీ కనీస పరిజ్ఞానం లేకుండా కనీసం విచారణ చేయకుండా, కనీసం అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కి తెలియకుండా, ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటుంది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో, బహుశా ఈ స్థాయిలో భూముల కేటాయింపు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా, చేసిన ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ఒక్కరు ఉండి ఉండేవాళ్ళు కాదేమో ఇప్పటి వరకు 2జి స్పెక్ట్రం గురించి మాట్లాడాం. లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు కుంభకోణం, మూడు లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూర్చడం కోసం, అప్పటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ప్రయత్నం చేశారని, ఇది అంతకు మించి 9,000 ఎకరాలకు సంబంధించిన జనరల్ మార్కెట్ వాల్యూనే, కోకాపేటలో నిన్న మొన్న ప్రభుత్వం అమ్మిన భూమి లెక్క ప్రకారం తీసుకుంటే ఎంత ఉంటుందో లెక్కేయండి. దాన్ని గజానల్లో మారిస్తే ఎంత ఉంటుందో లెక్కేయండి. దాన్ని టవర్స్ గా మారిస్తే ఎంత ఉంటుందో లెక్కేయండి. స్కై ఇస్ ద లిమిట్ కదా, అనేక ఐటీ ఇండస్ట్రీస్ భూముల ధరలు పెరగడం కారణంగా ఇబ్బంది పడుతున్నాయి కదా, హైదరాబాద్ లాంటి రాష్ట్రంలో, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, ఐటి పార్కులు డెవలప్ చేసి, ఐటి కంపెనీస్ కి ఇవ్వండి ఇండస్ట్రియల్ హబ్స్ గా తయారు చేయండి. పొల్యూషన్ లేని కంపెనీస్ చాలా వస్తున్నాయి, చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, లేదు ప్రభుత్వం దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంచండి, ఈ ప్రయత్నం చేయకుండా, ఆల్టర్నేటివ్ చూడకుండా, ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిగా ఉన్న ప్రజల ఆస్తిగా ఉన్న భూముల్ని, కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం, ప్రభుత్వం ఇంటెన్షనల్ గా చేస్తుంది. ప్రభుత్వం చూపిస్తున్న తొందర, ఆత్రం చూసినప్పుడు అనుమానం కలుగుతుంది. వారం రోజుల్లో మొత్తం అప్లై చేసుకుంటే ఇచ్చేస్తాం, 30 శాతనికే ఇచ్చేస్తాం ,ల్యాండ్ కన్వర్షన్ కి మీరు హెచ్ఎండిఏకి, మున్సిపాలిటీకి, డబ్బులు కట్టే అవసరమే లేదు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, మార్కెట్ వాల్యూ కోకాపేటలో ఎంత ఉంది, ఎంతకి భూమి అమ్ముడిపోయింది, 3000 రూపాయలు SFT అక్కడ, మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 15,000 20,000 కూడా అక్కడ అమ్ముతున్నారు ప్రైవేట్ గా అట్లాంటిది, అక్కడ 3000 ఉన్న దాంట్లో, ఇంకా మీరు 30% అంటే, 30% కి ఇద్దామనే ప్రయత్నం చేస్తుందంటే, ప్రభుత్వం తనకు తానుగా ప్రజల ఆస్తికి కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచేసే ప్రయత్నం చేస్తుంది. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ప్రజల్ని మోసం చేయడం, ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం, కేటీఆర్ చెప్పినట్టుగా దీంట్లో, ముఖ్యమంత్రులు ఉన్నారా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నారా , ముఖ్యమంత్రి బంధువులు ఉన్నారా, మనకు తెలియదు, మనకు అవసరం కూడా లేదు. బట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
ఏ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, దేనికోసం భూములు ఇచ్చారు, అనేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క మాట ఆన్సర్ ఉందా. అందుకు తెలంగాణ సమాజం ఈ భూముల కేటాయింపు కోసం, ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని అడ్డుకోకపోతే, తెలంగాణ భవిష్యత్తుకు ద్రోహం చేసినట్లు అవుతుంది. తెలంగాణ ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంటే దీన్ని ఆపకపోతే, దీన్ని చూస్తూ ఊరుకుంటే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణలో దోచుకున్నారు, తెలంగాణలో భూములు కొల్లగొట్టేసారు, తెలంగాణలో ఇంకేదో చేశారని మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో స్వయంపాలకులుగా ఉన్నవాళ్ళం, ఆ 9000 ఎకరాల భూములు, ఏ ప్రాంతానికి సంబంధించిన కంపెనీలు, ఏ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక వేతులు ఉన్నారో ఒకసారి చూడండి. వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో ఆలోచించండి. ఏ రకంగా ఈ తెలంగాణ ప్రయోజనాలకు లాభం చేకూరుస్తుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు సంబంధించిన ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ వాదులు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. Hiltp పాలసీ హర్రీగా తీసుకొచ్చి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది, ప్రభుత్వం మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అనుమానాలు పెరుగుతున్నాయి.


