ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి వలసలు పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. వరుసగా వైసీపీని నేతలు వీడుతున్నారు. సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేన పార్టీలో చేరిపోయారు. సామినేని ఉదయభాను, రాపాక వరప్రసాద్, గంధి శ్రీనివాస్, ఆళ్ల నానితో పాటు మగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. ఆ పార్టీ సీనియర్ నేత విజయసారెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ నుంచి అందరూ వెళ్లిపోతారన్నారు. జగన్‌ తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరని టీడీపీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అయితే అనూహ్యంగా వైసీపీలోకి వలసలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ చేరారు. ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ

Updated On
ehatv

ehatv

Next Story