తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు బీసలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హామీ ఇచ్చింది.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు బీసలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హామీ ఇచ్చింది. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ 42% రిజర్వేషన్లు అమలు చేయడానికంటే ముందు కులగణన కూడా చేస్తామని చెప్పింది. దేశంలో మొదటిసారిగా తెలంగాణ సర్కారు కులగణన చేసింది, కులగణన చేసిన క్రెడిట్ ని కూడా ఆ పార్టీ ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మేము కులగణని శాస్త్రీయంగా చేశాను చూడండి అంటూ చెప్తూ వస్తుంది. అయితే కులగణన చేసి 42% రిజర్వేషన్లకు సంబంధించి శాసన సభ తీర్మానం చేసి గవర్నర్ కి పంపించిన తర్వాత, దాన్ని రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం, సో ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు కాని వాతావరణం కనబడుతుంది. అమలు కాకపోవడంతో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన గడువు ముగిసిపోయింది, ఇమీడియట్ గా ఎన్నికలకు వెళ్ళాలి అంటూ, కోర్టుకి వెళ్ళిన నేపధ్యంలో, ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించండి అంటూ హైకోర్టు ఆదేశించింది.

ఓ పక్క హైకోర్టు ఆదేశం ఉంది, మరో పక్క గవర్నర్ దగ్గర బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, యాక్సెప్ట్ అవుతే తప్ప 42% రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు. వాటిని రాష్ట్రపతికి పంపించారు, గతంలో చాలా రాష్ట్రాల్లో 50% స్లాబ్ ను మించి రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భంగా, సుప్రీం కోర్టు నిబంధనలకు, సుప్రీం కోర్టు గైడ్లైన్స్ కి విరుద్ధంగా ఇది ఉంది, అంటూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, సో ఈసారి అలా జరగకుండా ఉండాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉండాలి కాబట్టి, రాష్ట్రపతికి పంపించాం రాష్ట్రపతి దగ్గరికి వెళ్లింది అని చెప్తున్నారు. రాష్ట్రపతి నుంచి పెండింగ్ లో ఉన్నాయి, సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఒక పక్క కోర్టు 30 తారీకు వరకు డేడ్‌లైన్ పెట్టింది, 42% రిజర్వేషన్లకి సంబంధించి హామీ ఇచ్చాం, 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీల్లో చాలా పెద్ద ఎత్తన వ్యతిరేకత వస్తుంది, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన లేదు అంటూ ఒక రాజకీయంగా దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిన్న జీఓ రిలీజ్ చేసింది, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా, బీసీలకు స్థానిక ఎన్నికలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో, 50% స్లాబ్ దాటిపోతుంది, దాదాపు 68% వరకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది సుప్రీం కోర్టు చెప్పినదానికి విరుద్ధంగా ఉంది, ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జీవో ఇచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్ గా షెడ్యూల్ రిలీజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On 27 Sep 2025 11:11 AM GMT
ehatv

ehatv

Next Story