తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడిచిన కొద్ది రోజులుగా ఒక సెన్సేషనల్ గా తయారయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడిచిన కొద్ది రోజులుగా ఒక సెన్సేషనల్ గా తయారయ్యారు. పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యని బహిరంగంగానే తప్పుపట్టారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు, ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయిస్తారు తప్ప, తనకు తానుగా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటించుకుంటారు అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాదు సోషల్ మీడియా జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాట చెప్పింది, ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదు, కాబట్టి మోసం చేసినా, వాళ్ళు న్యాయం చేసినా వాళ్ళ ఇష్టం, మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్ళు పట్టుకోను అంటూ మాట్లాడుతూ వచ్చారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు, భువనగిరి పార్లమెంట్‌ని గెలిపించి ఇచ్చినప్పటికీ, తనక ఇచ్చిన హామీని మాత్రం అధిష్టానం నెరవేర్చట్లేదు అని చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు దీనిపైన స్పందించలేదు, పెదవి విప్పలేదు, మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడారు. ఆయన ఇటీవల మునుగోడులో తాను ఆత్మగౌరవంతో బ్రతికే వ్యక్తిని, గతంలో రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వచ్చాను, మళ్ళీ అవసరమైతే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వస్తాను తప్ప, ఆత్మగౌరవాన్ని కోల్పోను అనే విషయాన్ని చెప్పారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు లాంటి ఇంప్రెషన్ కలిగిన నేపథ్యంలో, ఆయన పైన క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగడం కూడా చూశాం.

పార్టీ అధిష్టానం తనకు హామీ ఇచ్చింది అంటూ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్ని, ఆయన సోదరుడు ప్రస్తుత మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు పట్టడం కూడా చూశాం. తప్పు పట్టడం అంటే ఆయనకు హామీ ఇచ్చినట్లు నాకు తెలియదు అన్నారు. ఆయనకు హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదు అంటూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎవరు, మంత్రి పదవి ఇస్తామని చెప్పింది ఎవరు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వలేకపోవడానికి రీజన్ ఏంటి, ఇస్తామని చెప్పిన వాళ్లు, ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేత, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కోమటరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి అండగా నిలిచారు.

కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కి మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామి ఇచ్చిన మాట నిజమేనంటూ ఎండార్స్ చేశారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆ ఎండార్స్మెంట్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డికి ఇంతకాలం ఎందుకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది లాంటి ఒక చర్చకు ఆయన బలం చేకూర్చినట్లయింది, అంతేకాదు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాననే హామీ, తన ముందే జరిగింది, తన ముందే ఇచ్చారు, ఆ హామీ అధిష్టానం ఇస్తున్న సందర్భంగా నేను అక్కడున్నాను, నా ముందే అటువంటి హామీని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు అనే మాట కూడా భట్టి విక్రమార్క చెప్తున్నారు.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story