Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాటలను సినీ ఇండస్ట్రీ వినట్లేదా..!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటని సినిమా ఇండస్ట్రీ వినట్లేదా? పవన్ కళ్యాణ్ మాట అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్క లేదా?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటని సినిమా ఇండస్ట్రీ వినట్లేదా? పవన్ కళ్యాణ్ మాట అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్క లేదా? పవన్ కళ్యాణ్ మాటని.. పవన్ కళ్యాణ్ కూడా వినట్లేదా? పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటని తానే మర్చిపోతున్నారా? హరిహర వీరమల్లు సినిమా అంశానికి సంబంధించి జరిగిన పరిణామాలను చూస్తే నేను వేసిన ప్రశ్నలన్నీ నిజమే అనిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమాకి ఆంధ్రప్రదేష్‌లో బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పుష్ప 2 సినిమా తర్వాత జరిగిన పరిణామాలు చూసిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవలేదు. ముఖ్యమంత్రిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్‌గా మాట్లాడడం చూశాం, అదే సమయంలో ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం చూశాం. ఆ సుదీర్ఘ పత్రికా ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, రాసిన రాతలు అక్షరాలు ఏంటంటే, ఎవరైనా సినిమా టికెట్లకు సంబంధించిన ధరలు పెంచుకోవాలంటే ఇకపైన ప్రభుత్వాన్ని ఇండివిడ్యువల్‌గా వచ్చి అప్రోచ్ కాకూడదు, చాంబర్ ద్వారా రావాలి, ఇండివిడ్యువల్ బెనిఫిట్స్ ఇవ్వడం కుదరదు, ఏం జరిగినా చాంబర్ ద్వారానే జరగాలి, ఈ మాటలు పవన్ కళ్యాణ్ పత్రిక ప్రకటనలో ఆయన కార్యాలయం నుంచి అఫీషియల్ గా వచ్చిన ప్రకటన ఇది, ఆ ప్రకటనలో పొందుపరిచారు ఇవన్నీ. ఎవరి సినిమా టికెట్లు ధరలు పెంచాలన్నా చాంబర్ నుంచే రండి, చాంబర్ నుంచే వచ్చి అప్రోచ్ అవ్వండి అని చెప్ఆరు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి చాంబర్ వెళ్లి, ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినట్లుగా ఎక్కడా చూడలేదు, మనం కలిశాం అనే విషయం చాంబర్ చెప్పట్లే, కలిసినట్టుగా ఎక్కడ ఫోటోగ్రాఫ్ లేదు, కలిశారనే ప్రకటన ఎక్కడా లేదు, బట్ టికెట్ల ధరలు పెరిగిపోయాయి, ఎలా పెరుగుతాయి? పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ ఆ సినిమా నిర్మాత చాంబర్ ని కలిసి, చాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని అప్రోచ్ కాలేదు అంటే, సినిమా ఇండస్ట్రీ చాంబర్ పవన్ కళ్యాణ్ మాట వినట్లేదా లేదు, పవన్ కళ్యాణ్ ఆయనే రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనకు భిన్నంగా టికెట్ల ధరలు ఎలా పెంచేసుకుంటారు, పెంచకూడదు కదా. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
