Pawan Kalyan : గొంతు పెంచుతున్న పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా ప్రభుత్వంలో గొంతు పెంచుతున్నట్లుగా కనపడుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా ప్రభుత్వంలో గొంతు పెంచుతున్నట్లుగా కనపడుతుంది. ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందులో ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం. తాజాగా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టింది, పెడుతోంది. కేవలం రాజకీయ పరమైన విమర్శలకు మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వం కట్టాల్సిన ఆసుపత్రులని, ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు, తరహ చర్చ జరగడం చూస్తున్నాం.
ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకతకు, మరింత వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతుంది. దాంతో పాటు ఇటీవల భూముల కేటాయింపుల అంశం, రకరకాల పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములు, ఆ భూములు కేటాయింపుల స్థాయిలో ఉద్యోగాలు వస్తాయా లేదా, గతంలో కేటాయించిన భూములు అక్కడ కంపెనీలు పెట్టారా లేదా, ఇటువంటి రకరకాల అంశాలపైన కూడా ప్రభుత్వం అభాసు పాలవుతుంది. ఇటీవల వరుసా పేరుతో కంపెనీకి భూములు కేటాయించిన అంశం కూడా ప్రజల్లో ప్రభుత్వాన్ని పలచన చేసింది. ఇటువంటి అంశాల పైన కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడడానికి వీలు లేదు, కూటమి సర్కార్ కాబట్టి, మిగతా పార్టీలు కూడా ప్రభుత్వం చేసిన మంచిలో క్రెడిట్ ని ఎలా తీసుకుంటాయో, ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల కారణంగా రాజకీయంగా నష్టాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగానే ఇటువంటి నష్ట నివారణ చర్యలో భాగంగానే, నష్టం జరుగుతున్న అంశాల పట్ల ప్రశ్నించడం ద్వారా, ప్రజల వైపు ప్రజల కోణంలో తాను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ క్రమంగా స్వరం పెంచుతున్నారు, పవన్ కళ్యాణ్ క్రమంగా ప్రజలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు, అది కూడా పద్ధతిగా రైట్ ప్లాట్ఫామ్ పైన, మంత్రిమండలి సమావేశం జరుగుతున్న సందర్భంగా క్యాబినెట్ మంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలోనూ, తీసుకున్న నిర్ణయాలపై పైన చర్చించడం సహజం కానీ, చాలా సందర్భాల్లో క్యాబినెట్ సమావేశాల్లో, ఒక ఎజెండా పెట్టుకొని వచ్చి దాని ప్రకారం ముందుకు వెళ్తారు తప్ప, ఏది మంచి, ఏది చెడు అని చర్చించే సాంప్రదాయం చాలా తక్కువగా ఉంటుంది. కూటమి భాగస్వామ్య సంకీర్ణ సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేష్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంపెనీకి భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం, కంపెనీ చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన అంశం పైన క్యాబినెట్ సమావేశంలో అధికారుల పైన ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో కూడా ఆయన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కలెక్టర్ల సదస్సులోనే, ముఖ్యమంత్రి పక్కన కూర్చుండగానే కలెక్టర్లను ప్రశ్నించి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు. చెక్‌పోస్టులు పెట్టకుండా మేము ఇక్కడి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణ చేయొద్దని చెప్తున్నప్పటికీ, రేషన్ బియ్యం పోర్టు కి ఎలా వెళ్తున్నాయి, ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారు, ఎవరు మిమ్మల్ని గట్టిగా పని చేయకుండా ఆపుతున్నారు అంటూ నేరుగా ముఖ్యమంత్రిని పక్కనే పెట్టుకునే అధికారులని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం చూశాం. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
