జనసేన పార్టీ పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు కనబడుతుంది, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘ సమయం సేన,తో సేనాని గడపబోతున్నారు

జనసేన పార్టీ పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు కనబడుతుంది, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘ సమయం సేన,తో సేనాని గడపబోతున్నారు, జనసేన కార్యకర్తలు నాయకులు యంత్రాంగంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘ సమయం ఈ సమావేశం జరగబోతుంది, గతంలో అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఇంకేదో బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఒకటి రెండు సందర్భాల్లో పార్టీకి సంబంధించిన నాయకులని పిలిచి పవన్ కళ్యాణ్ వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం మాత్రం లాంటివి మాత్రమే చూశాం. కానీ ఈసారి ఆయన చాలా సుదీర్ఘంగా మూడు రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశారు, మొదటి రోజు సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు అందరితో ఆయన సమావేశం కాబోతున్నారు, పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కార్యచరణ ఏ రకంగా ఉండాలి, పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అనే అంశానికి సంబంధించి వాళ్ళందరితో ఆయన చర్చించబోతున్నారు. ఆ తర్వాత అదేరోజు మధ్యాహ్నం ఆయన పార్టీకి సంబంధించిన కార్యవర్గంతో దాదాపు 25,300 మంది ఉంటారేమో కార్యవర్గం యాక్టివ్ గా పని చేస్తున్న వాళ్ళు, ఆయా నియోజక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా సుదీర్ఘంగా సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం అంతా ఆ రోజు పార్టీకి సంబంధించిన కార్యవర్గంతో సమావేశం అవుతారు, సో మొదటి రోజు పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, మధ్యాహ్నం నుంచి కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం వీళ్ళందరితో సుదీర్ఘంగా ఆయన చర్చలు జరుపుతారు. సుదీర్ఘంగా వాళ్ళతో సమావేశం అవుతారు, ఇక నెక్స్ట్ డే రోజు చాలా కీలకమైన రోజుగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు, ఆరోజు ప్రతి నియోజక వర్గానికి సంబంధించి, సెలెక్టెడ్ గా పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న వాళ్ళు, పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ కోసం పని చేస్తున్న వాళ్ళు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాలలో పార్టీ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఆయా నియోజక వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి, వాటిపైన పోరాటం చేసిన వాళ్ళు అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్, వీళ్ళందరితో కూడా మొత్తం డే లాంగ్ సుదీర్ఘంగా వాళ్ళతో సమావేశం కాపోతున్నారు. వన్ టూ వన్ వాళ్ళతో సమావేశం అవుతారు అనేది మనకున్న సమాచారం. సో దాని ద్వారా ప్రతి నియోజక వర్గంలో పార్టీ అంతరంగం, పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకు ఉన్న ఇబ్బందులు ఏంటి, అక్కడ పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, దానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం వైపు నుంచి ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఇక చివరి రోజు ఓ భారీ బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, 30వ తారీకు, 28, 29, 30, తారీకుుల్లో ఈ మొత్తం మీటింగ్స్ మూడు మీటింగ్స్ ఉండబోతున్నాయి.ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!




ehatv

ehatv

Next Story