ఏపీలో లిక్కర్ కేసులోకి ఈడి ఎంటర్ అయింది ఇలాంటి వార్తలు చూస్తున్నాం, ఈడి ఎంటర్ అయింది కాబట్టి ఇక కీలకమైన అరెస్టులు ఉంటాయి ఇలాంటి ప్రచారము చూస్తున్నాం.

ఏపీలో లిక్కర్ కేసులోకి ఈడి ఎంటర్ అయింది ఇలాంటి వార్తలు చూస్తున్నాం, ఈడి ఎంటర్ అయింది కాబట్టి ఇక కీలకమైన అరెస్టులు ఉంటాయి ఇలాంటి ప్రచారము చూస్తున్నాం. ఏం జరగబోతోంది, లిక్కర్ కేసులో ఈడి ఎందుకు ఎంటర్ అయింది, ఈడి ఎంటర్ అవ్వడం వెనక రీజన్ ఏంటి, ఈడిని ఎవరు పంపించారు, ఈడిని పంపించడం వెనక రీజన్ ఏంటి, ఇటువంటి చర్చ రాజకీయంగా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దేశంలో అనేక కేసుల్ని చూస్తోంది. ప్రధానంగా మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశాలు, మనీ లాండరింగ్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఈడి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. సో ఈడి ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది.

ఈడీ టేకప్ చేస్తున్న కేసులని, గడిచిన 11 సంవత్సరాలలో చూస్తే పొలిటికల్ మోటివేటెడ్ కేసులు తప్ప ఇంకొకటి కాదు, ఈడీ గడిచిన 11 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులని కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి నాయకులని కానీ, అరెస్టు చేసిన పరిస్థితి లేదు. ఈడి గడిచిన 11 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళకు సంబంధించిన సన్నిహితుల కంపెనీల పైన మాత్రమే దాడులు, కేసులు చేస్తూ వస్తుంది. ఈడి కొన్ని ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాల పైన కూడా విచారణ చేసింది. అవి కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే. ఇది ఈడి తాజా చరిత్ర ఇది నేను చెప్తున్న, చరిత్ర కాదు, సుప్రీం కోర్టు చెప్పిన చరిత్ర, ఇటీవల తమిళనాడుకు సంబంధించిన మంత్రి బాలాజీ అంశానికి సంబంధించి, ఈడి చేసిన ఓవర్ యక్షన్ పైన, సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈడి మీరు పొలిటికల్ గా వేటాడుతున్నారు, ఎందుకు రాజకీయపరమైన దాడులు చేస్తున్న తరహాలో, ఈడి ఎందుకు బిహేవ్ చేస్తోంది, ఈడి మీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ సుప్రీం కోర్టు ఈడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని చూశాం.

కొద్ది రోజుల క్రితం, అంతేకాదు ఈడికి, సంబంధించి ఈడి విచారణ చేసిన తర్వాత, దోషులెవరో తేల్చిన పరిస్థితి లేదు 95 % పైగా కేసుల్లో ఈడి ఏం తీల్చలేకపోయింది, ఈడి ఏం బయట పెట్టలేకపోయింది, ఇది ఈడి చరిత్ర. ఇక లిక్కర్ కేసు లోకి ఎందుకు వచ్చింది అంటే, లిక్కర్ కేసులో ఆ నాలుగైదు రాష్ట్రాల్లో, లిక్కర్ కి సంబంధించిన డబ్బులన్నీ కూడా సర్క్యులేట్ అయ్యాయి, నాలుగైదు రాష్ట్రాల్లో ఆ డబ్బులన్నీ పెట్టుబడుల రూపంలోకి వెళ్ళాయి, కాబట్టి ఈడి ఎంటర్ అయింది అని చెప్తున్నారు, కేసుకు సంబంధించి ఇనిషియల్ స్టేజ్ లోనే ఈడి దీనిలోకి ఎంటర్ అవ్వడం చూశాం. ఆ తర్వాత ఈడి యాక్టివ్ గా పని చేయడం చూడలా, బట్ నిన్న ఈడి ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి దాదాపు 20- 25 చోట్ల దాడులు , సోదాలు చేసింది. సో ఆ సోదాలు జరిపిన నేపథ్యంలో ఈడి ఎంటర్ అయింది, ఈడి ఏదో చేయబోతుంది, ఇలాంటి స్పెక్యులేషన్ ఇప్పుడు చూస్తున్నాంజ ఏం చేయబోతుంది ఈడి, ఈ మొత్తం నేను ముందు బ్యాక్ డ్రాప్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈడి ఎంటర్ అవ్వడం అనేది పొలిటికల్ మోటివేటెడ్ గానే ఉంటుంది, తప్ప ఇంకో రకంగా కాదు, ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ కేస్ లో కూడా ఈడి ఎంటర్ అయింది. ఈడి లిక్కర్ కేసులోకి రావడం వెనుక, ఈడి లిక్కర్ కేసలో ప్రవేశించడం వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉందా, లేదా అనేది ప్రస్తుతం చర్చించాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి సంబంధించి, అరెస్ట్ చేయడానికి సంబంధించి, కూటమి చాలా బలంగా ఉంది. కూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, మా నాయకుని అరెస్ట్ చేశారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాల్సిందే, తెలుగుదేశం పార్టీ పైన కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇంకెక్కడో, ఇంకెక్కడో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అంటూ ఓపెన్ గానే మాట్లాడడం చూస్తున్నాం.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' మరింత విశ్లేషణ..

ehatv

ehatv

Next Story