Election Commission : బుకాయిస్తున్న ఎన్నికల కమిషన్.. ప్రెస్మీట్పై 'YNR' అనాలసిస్..!
ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నా మొదటి రియాక్షన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అడ్డంగా దొరికిపోయింది.

ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నా మొదటి రియాక్షన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అడ్డంగా దొరికిపోయింది. ఎలక్షన్ కమిషన్ బుకాయిస్తుంది, ఎలక్షన్ కమిషన్ పైన ప్రజల్లో ఉన్న అపోహలు అనుకోండి, రాజకీయ పార్టీలు సృష్టించిన అపోహలు, ప్రజలకున్న అనుమానాలు అనుకోండి, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అనుకోండి వీటికి వేటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరగలేదు. ఏ ఒక్క ప్రశ్న కూడా ప్రాపర్ గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయలేదు. ఈవెన్ అక్కడ నుంచి మా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది చేసిన ప్రశ్నలు కూడా, ముగ్గురు నలుగురికి సంబంధించిన ప్రశ్నలన్నీ, ఒకేసారి తీసుకొని దాంట్లో తాము చెప్పాలనుకుంటున్న వాటికి ఆన్సర్ చెప్పి, మిగతా వాటిని ఎస్కేప్ చేసింది, ఎస్కేప్ చేసిన వాటిని మళ్ళీ జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది, మీరు ఇంతకుముందు ఫలానా వాళ్ళు అడిగిన ప్రశ్నని ఎస్కేప్ చేశారు, దీనికి ఇప్పుడైనా ఆన్సర్ చెప్పండి అంటే, మళ్ళీ ఎస్కేప్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేనట్టు కనబడింది, ఆన్సర్ లేనప్పుడు లేనట్టు, కనపడి బుకాయించడం కాస్త కన్సిడర్ చేయొచ్చు, వాళ్ళకి ఆన్సర్ లేదు దొరికిపోయారు. ఏం చెప్పాలో అర్థం కాక బుకాయిస్తున్నారు అనుకుందాం కానీ, అత్యంత ప్రమాదకరమైన అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పైన ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ లో కనబడింది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడిన మాటలు చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ తమ ప్రత్యర్ది రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతారో అలా అనిపించింది. బాధ్యతతో దేశ ప్రజల అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రెస్ మీట్ గా అది కనపడలేదు, నేను ఇంకా ముందుకెళ్లి చెప్పగలను ఆ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్న మాటలు, భాష, ఆయన హావభావాలు, ఆయన ప్రొనౌన్స్ చేస్తున్న తీరు చూసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారేమో అనిపించింది. టీవీలో చూడకుండా వింటే మోదీ ప్రసంగంలా అనిపించింది. బహుశా ఆయన నరేంద్ర మోడీ గారి ప్రసంగాలను ఎక్కువగా ఫాలో అవుతారేమో తెలీదు, నరేంద్రమోదీ హావభావాలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతున్న భాషలో, ప్రతిపక్ష పార్టీలపైన ఆయన మాట్లాడుతున్న సందర్భంగా కనపడ్డాయి. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
