తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది చూశాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది చూశాం. మొదటి రెండు టర్మ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, తర్వాత మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు, 2014లో బిఆర్ఎస్ పార్టీకి 62 స్థానాలు మాత్రమే వస్తే, ఆ తర్వాత జరిగిన ఎమఎల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చిన తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ సర్కార్ని కూల్చే కుట్ర జరుగుతోంది అంటూ చర్చ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఇతర పార్టీల నుంచి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంది బిఆర్ఎస్ పార్టీ. అప్పుడు వైసీపీ కి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేకమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత 2018 లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది శాసన సభ ఎమ్మెల్యేలు శాసన సభ పక్షం అంతా బిఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం చూశాం. ఆ రెండు సందర్భాల్లో మా ఎమ్మెల్యేలని లాక్కెళ్ళిపోయారు, మా ఎమ్మెల్యేలని తీసుకున్నారు, తీసుకున్నారు, ప్రజాస్వామ్యం లేకుండా చేశారు అంటూ ,కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించింది బిఆర్ఎస్ పార్టీ అంటూ ఆందోళన చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది, నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా మొదటిసారి బిఆర్ఎస్ పార్టీకి 2014 లో ఏ స్థానాలు వచ్చాయో దాదాపు అదే స్థానాలు వచ్చాయి, 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది,

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారుని కూలుస్తారనే ఆందోళనతోనో, భయంతోనో కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని చేర్చుకుంది. ఇలాంటి చర్చ కాంగ్రెస్ ని బలపరుస్తున్న మీడియా రాస్తూ వచ్చింది, అయితే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను నేరుగా ఎలక్షన్లో పోటీ చేయించడం ద్వారా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రాన్ని ఇచ్చింది, ఇటువంటి అస్త్రాన్నే గతంలో కేసిఆర్ కూడా ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా, వేరే పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని, ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థిని, ఎమ్మెల్యే ని నేరుగా క్యాబినెట్ లోకి ఎలా తీసుకుంటారు లాంటి చర్చ అప్పుడు చూశాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శాసన సభ పక్షం మొత్తం అంతా కూడా బిఆర్ఎస్ పార్టీలో కలిసిపోవడంతో, ఆ చర్చకు ఫుల్ స్టాప్ అయింది, అక్కడ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు, ఇది టెక్నికల్ గా అడ్డంగా కాంగ్రెస్ పార్టీ దొరికిపోయినట్లు అయింది, అలాగే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరామంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, మరి కొంతమంది ఎన్నికలు వస్తాయనే భయంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బిఆర్ఎస్ లోనే ఉన్నామంటూ మాట్లాడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 10 మంది మా పార్టీలో చేరారు తప్పేంటి, గతంలో చేరలేదా అంటూ ఓపెన్ గా మాట్లాడారు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కమిట్ అవుతున్నారు, వాళ్ళంతా మా పార్టీలో చేరారని రేవంత్ రెడ్డి స్వయంగా అందరికీ కండువా కప్పారు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతే కాదు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఏమవుతుంది, గతంలో మారిన వాళ్ళకి ఏం జరిగింది, ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది, గతంలో ఉన్న న్యాయం చట్టం ఇప్పుడే ఉన్నాయి కదా అప్పుడు జరిగిందేదో, ఇప్పుడు ఏం జరుగుతుంది కొత్తగా అంటూ ఆయన మాట్లాడడం అసెంబ్లీ వేదికగా చూశాం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story