తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే, ఉపఎన్నికలు జరిగే పరిస్థితి కనపడుతుంది.

తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే, ఉపఎన్నికలు జరిగే పరిస్థితి కనపడుతుంది.తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, స్పీకర్ రెండు రోజుల క్రితం ఐదుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకోబోతున్నారు. ఇవ్వాలో రేపో లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. సో స్పీకర్ నిర్ణయమే అల్టిమేట్ గా ఫైనల్ గా ఉంటుంది, వాళ్ళ పైన అనర్హత వెయిట్ వేయాలా లేదా అనేది ఓ పార్టీ నుంచి గెలిచి, పార్టీ సింబల్ పైన గెలిచి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరడం అనేది వీళ్ళ అనర్హతకు, వీళ్ళకు నోటీసులు అందుకోవడానికి కారణమైంది.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా అనేకమంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనేకమంది బిఆర్ఎస్ పార్టీలో అప్పుడు చేరడం చూశాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా ఉంది, మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ, బిఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుంది, ఇది పార్టీలలో, పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల అందరినీ చేర్చుకొని తెలంగాణలో రాజకీయాలని భ్రష్టు పట్టిస్తోంది, బిఆర్ఎస్ అంటూ, కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దానికి అప్పుడు బిఆర్ఎస్ పార్టీ చెప్పిన సమాధానం మేము ఎమ్మెల్యేలుగా చేర్చుకోలేదు. మొత్తం శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకున్నాం, 19 మంది కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యేలు 2019 లో గెలిస్తే, అందులో 12 మంది మొత్తం వచ్చి మా దగ్గర చేరినప్పుడు అది శాసన సభా పక్షం విలీనం అవుతుంది తప్ప, ఎమ్మెల్యేల చేరిక కాదు అంటూ అప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు తమ ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోవడం చూశాం. అంతకుముందు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరడం కావచ్చు, దాంతో పాటు బిఎస్పీ కి సంబంధించిన ఎమ్మెల్యే లు చేరడం కావచ్చు, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు దాదాపు 12 మందికి పైగా ఎమ్మెల్యే లు చేరడం కావచ్చు, ఇదంతా కూడా శాసన సభ పక్షాల విలీనం జరిగింది తప్ప, ఎమ్మెల్యేల చేరిక కాదు అంటూ బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. సో టెక్నికల్ గా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన సరైనదే కావచ్చు, కానీ ఎథికల్ గా అది సరైన వాదన కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు, అలాంటి ప్రశ్న, అటువంటి విమర్శలని బిఆర్ఎస్ పార్టీ ఫేస్ చేసింది.

తెలంగాణలో రాజకీయ స్టెబిలిటీ లేకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో, ఇతర పార్టీలు వాళ్ళని మేము చేర్చుకున్నాం అంటూ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చెప్పింది, సో ఇది గతం ఇప్పుడు, 10 ఏళ్ల పాటు బాధిత పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని బిఆర్ఎస్ పార్టీ అక్రమంగా తీసుకుంది అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకుంది. తమ పార్టీలో 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కండువ కప్పి ఆహ్వానించిన ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ ఆయన ఆహ్వానించడం చూశాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చూశాం. ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story