ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోతోంది.

ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోతోంది. అవినీతి వైపు అడుగులు వేస్తోంది. గతంలో అధికారంలో లేని సమయంలో చెప్పిన మాటలకు భిన్నంగా ముందుకెళ్తోంది. ఈ మాటలంటోంది మాజీ ఐపిఎస్ అధికారి, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు ఈయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్ ఉద్దేశించి ప్రధానంగా ఆంధ్రప్రదేష్‌లో ప్రభుత్వం నారా లోకేష్ నాయకత్వంలోనే నడుస్తుంది. ఇది నారా లోకేష్ ప్రభుత్వం అనే విషయం అందరికీ తెలుసు. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, నారా లోకేష్ ప్రభుత్వం అనే విషయం, నారా లోకేష్ ఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే దానిపైన ఎవరికీ అభ్యంతరాలు లేవు. అదే ప్రభుత్వం ఆంధ్రప్రదేష్‌లో నడుస్తోంది. అయితే నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పాలన 2, జగన్మోహన్ రెడ్డి 2.0 లాగా నారా లోకేష్ పాలన నడుస్తోంది అంటూ, సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నారు. ఆయన కొన్ని అలిగేషన్స్, కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తున్నారు. ఆయన చెప్తున్న అబ్సర్వేషన్స్ ప్రకారం, జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియానో, గడిచిన దశాబ్దన్నర పైగా చేస్తూ వస్తున్న క్యాంపెయిన్, జగన్మోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టాడు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆ డబ్బులతో భారీగా రాజప్రసాదాల లాంటి నివాసాలను కట్టుకున్నారు, వాటిలో ఆయన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటూ, ఆరోపణలు చేస్తూ వచ్చారు. బెంగళూరు ప్యాలెస్ గురించి, పులివెందుల ప్యాలెస్ గురించి, హైదరాబాద్‌ లోటస్ పాండ్ గురించి, తాడేపల్లి ప్యాలెస్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం, కానీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే, నారా లోకేష్ కూడా కుప్పంలో ప్యాలెస్ నిర్మించారు.

అమరావతిలో ఇంకో ప్యాలెస్ నిర్మిస్తున్నారు, హైదరాబాద్‌లో ఇప్పటికే ఓ భారీ ప్యాలెస్ ఉంది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే భారీ రాజప్రసాదాలు నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారు, జగన్ దారిలోనే ఆయన కూడా వెళ్తున్నారు అనే అలిగేషన్, అనే అబ్సర్వేషన్ నాగేశ్వరరావు చెప్తున్నారు. దాంతో పాటు ఆయన చెప్తున్న మరొక మాట అధికారంలోకి రావడానికి ముందు అవినీతిపరుల్ని జైలుకి పంపిస్తాం, అవినీతి డబ్బు అంతా వెనక్కి తీసుకొస్తాం అంటూ, మాట్లాడుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని జైలుకు పంపించింది లేదు, అవినీతి కేసుల్లో, పైగా మీరు పెట్టిన కేసులకు సంబంధించి కూడా, ఆ కేసులన్నీ వీగిపోతున్నాయి. ఆ కేసుల్లో బలం లేకుండా పోతుంది. ఆ కేసుల ద్వారా అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. అధికారంలోకి రావడానికి ముందు అవినీతి జరిగింది, అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అంటూ రకరకాలుగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చారు కొన్ని కేసులు పెట్టారు, ఆ కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story